కోలీవుడ్ నటుడు బాబీ సింహా పుట్టినరోజు సందర్భంగా 'డిస్కోరాజా' చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది. సినిమాలోని అతడి పోస్టర్‌ను విడుదల చేసింది. బర్మా సేతు అనే ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు బాబీ. ఇందులో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
తమిళ చిత్రం 'జిగర్తాండ'(తెలుగులో 'గద్దలకొండ గణేశ్') ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు బాబీ సింహా. ఆ సినిమాలో ప్రతినాయకుడిగా మెప్పించాడు. కోలీవుడ్‌లో తక్కువ కాలంలోనే ఎక్కువ చిత్రాల్లో నటించాడు. ఈ ఏడాది.. రజనీకాంత్ నటించిన 'పేట' చిత్రంలోనూ కనిపించాడు.
1983 నవంబరు 6న హైదరాబాద్‌లో పుట్టిన బాబీ సింహా తెలుగు వాడే. చిన్నతనంలోనే అతడి కుటుంబం కొడైకెనాల్‌కు మకాం మార్చింది. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడీ నటుడు.
'డిస్కోరాజా'కు ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రజనీ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇదీ చదవండి: సినీ నటుడి వాట్సాప్ హ్యాక్- బూతు మెసేజ్‌లతో వేధింపులు