విక్టరీ వెంకటేశ్ .. ప్రస్తుతం 'నారప్ప' సినిమాలో నటిస్తున్నాడు. అనంతపురంలో ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. తమిళ హిట్ చిత్రం 'అసురన్'కు రీమేక్ ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇందులోని యాక్షన్ సన్నివేశాల కోసం మరో దర్శకుడిని తీసుకున్నారని సమాచారం.
యాక్షన్ కోసం మరో దర్శకుడు
శ్రీకాంత్ అడ్డాల.. ఇప్పటివరకు కుటుంబ కథా చిత్రాలనే తీశాడు. ఈ సినిమాకు అతడ్ని దర్శకుడు అని ప్రకటించగానే చాలా మంది పెదవి విరిచారు. కానీ నిర్మాత సురేశ్‌బాబు నమ్మకముంచి, ఈ బాధ్యతను అప్పగించారు. అయితే 'వెంకీమామ' షూటింగ్లో డైరెక్టర్ బాబీ పనితనం సురేశ్‌బాబుకు నచ్చింది. అందుకే 'నారప్ప'లోని యాక్షన్ సన్నివేశాల బాధ్యతను ఇతడికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాడని టాక్.
![naarappa venkatesh looks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5836909_looks.jpg)
ఇదేం కొత్త కాదు
ఇలా ఓ సినిమాలోని యాక్షన్ సీన్స్ కోసం వేరొక దర్శకుడు పనిచేయడం కొత్తేమి కాదు. ప్రముఖ రచయిత, దర్శకుడు విజేయంద్ర ప్రసాద్ తీసిన 'రాజన్న'లోని ఫైట్స్‌ను దర్శకధీరుడు రాజమౌళి రూపొందించాడు. ప్రేక్షకులను అవి ఎంతలా అలరించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.