ETV Bharat / sitara

వెండితెర నాయిక.. నృత్యాభినయ తారక శోభన - entertainment news

నటి, డ్యాన్సర్​, పద్మశ్రీ పురస్కార గ్రహీత, టీవీ షోకు న్యాయనిర్ణేత ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించిన శోభన.. నేడు 51వ ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆమెపై ప్రత్యేక కథనం.

వెండితెర నాయిక.. నృత్యాభియన తారక శోభన
నటి శోభన
author img

By

Published : Mar 21, 2020, 5:32 AM IST

Updated : Mar 21, 2020, 7:21 AM IST

ఆ కళ్ళు వెన్నెల వాకిళ్లు. కమ్మని కలల లోగిళ్లు. ఎలాంటి భావోద్వేగాన్ని అయినా చిటికెలో వ్యక్తీకరించే సుందర, సుమధుర కావ్యాలు. అందం, అభినయం, నాట్యం మేలి కలయిక శోభన. సినిమాల్లో నటించినా ఎక్కడా హుందాతనాన్ని కోల్పోలేదు. సంప్రదాయ చీరకట్టులో మెరిసినా, మోడ్రన్‌ డ్రెస్‌లో మాయ చేసినా తను తనలాగే ఉంది తప్ప ఎక్కడా అతి కనిపించనీయలేదు. అందుకే...శోభనను వినయ శీలి అని ఆమె ఆత్మీయులు తెగ మెచ్చుకుంటారు. ఒక్కసారి ఆమె అలవోకగా నిలిచిందా? అజంతా గుహల నుంచి పారిపోయి వచ్చిన ఓ అత్యద్భుత శిల్ప సౌందర్యం కళ్లెదురుగా కనిపించినంత ఆనంద పరవశులవుతారు ఆమె అభిమానులు. అడుగు కదిపిందా? ముగ్ధమోహనత్వంతో ఆ అష్టపదులు నర్తించినట్లేనంటారు. ఇటు సినిమాలకు గ్లామర్‌ అద్దింది. క్లిష్టమైన సన్నివేశాల్లో అభినయాన్ని జోడించింది. నాట్య కళాకారిణిగా శోభ తెచ్చింది. తనకెంతో పేరు తెచ్చిన పాపులర్‌ మీడియా సినిమా అంటే అంతులేని అభిమానం. ఇష్టపడి నేర్చుకున్న శాస్త్రీయ నృత్యమంటే ప్రాణం...ప్రణవం...సర్వం.

actress shobana
నటి శోభన

ఔను...ఆమె మనసంతా భావరాగతాళమయం. తనువంతా భరత నాట్యం. అందుకే ఆమె సినిమాలకు దూరంగా, తన మనసుకు నచ్చిన నాట్యానికి మరింత దగ్గరగా జీవితాన్ని తీర్చిదిద్దుకుంది. శోభన భారతదేశం గర్వించదగ్గ అభినయ తారక. ఆమె ప్రతిభ బహుముఖం. ఆమె నటి, నర్తకి, కొరియోగ్రాఫర్, మృదంగ కళాకారిణి. అంతేనా? తాను ప్రదర్శించే నృత్య ప్రదర్శనలకు క్రియేటర్, స్క్రిప్ట్‌ రైటర్‌. రంగస్థల రూపకర్త.. ఇలా అన్ని విభాగాల్లో సృజనను ఆవిష్కరించే కళాకారిణి. కేవలం తెరపై మిలమిల మెరిసే నాయిక మాత్రమే కాదు. నాట్యరాణి. ప్రస్తుతం తానెంతో ఇష్టపడి నేర్చుకున్న భరతనాట్యాన్నే ఆరాధిస్తూ... అర్చిస్తూ దేశవిదేశాల్లో అవిశ్రాంతంగా నాట్య ప్రదర్శనలు ఇస్తూ నృత్య కళామతల్లి సేవకే అంకితమైంది. క్లాసిక్‌ డాన్సర్‌గా శోభన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సముపార్జించుకుంది.

వారసత్వంగా నాట్యవైభవం

shobana
ట్రావెన్‌కోర్‌ సిస్టర్స్‌ లలిత, పద్మిని, రాగిణి

ట్రావెన్‌కోర్‌ సిస్టర్స్‌గా ప్రసిద్ధి పొందిన లలిత, పద్మిని, రాగిణి నాట్య కళాకారిణులకు శోభన స్వయానా మేనకోడలు. క్లాసికల్‌ ఇండియన్‌ డాన్సర్స్‌గానే కాకుండా నటీమణులుగానూ వీరు పేరు పొందారు. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నదేమో... సినీ, క్లాసిక్‌ డాన్స్‌ రంగాల్లో ప్రతిభ చూపిస్తోంది శోభన. 1970 మార్చి 21న కేరళ తిరువనంతపురంలో పుట్టిన ఈమె, దక్షిణాదిలోని అన్ని భాషాల్లోనూ నటించింది. 1980-1990 మధ్యలో మలయాళం, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలతో మెప్పించింది. మరో ప్రఖ్యాత నటి రేవతి దర్శకత్వం వహించిన ఇంగ్లీష్‌ చిత్రంలోనూ నటించి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. 2002లో విడుదలయిన 'మిత్ర.. మై ఫ్రెండ్‌' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 49వ జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ ఇంగ్లీష్‌ చిత్రంగా పురస్కారాన్ని పొందింది. ఉత్తమ నటిగా శోభన, ఉత్తమ ఎడిటర్‌గా బీనాపాల్‌ అవార్డులను అందుకున్నారు.

భారతీయ సంప్రదాయాల్లో పెరిగిన ఓ యువతి వివాహం కారణంగా విదేశానికి వెళ్లి, అక్కడి సంస్కృతిలో ఇమడలేక ఇబ్బంది పడడమే కాదు... తన కూతురు ఆ సంస్కృతికి ఆకర్షితురాలవడాన్ని నివారించలేని పరిస్థితిలో ఇంటర్నెట్‌ ద్వారా పరిచితమైన ఓ ఫ్రెండ్‌తో ఏర్పడిన అనుబంధమే ఈ చిత్ర ఇతివృత్తం. రెండు సంస్కృతుల మధ్య నలిగిపోయిన హీరోయిన్​గా శోభన నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు.

actress shobana
నటి శోభన

బాలనటిగా తెరంగేట్రం

శోభన బాలనటిగా అరంగేట్రం చేసింది. 1970లో పుట్టిన ఈమె, 1972లోనే కెమెరా ముందుకు వచ్చింది. 'అమర్‌ ప్రేమ్‌'.. బాలనటిగా ఆమెకు తొలి చిత్రం. పెద్దయిన తరువాత ఆమె హీరోయిన్​గా నటించిన తొలి సినిమా 'ఏప్రిల్‌ 18'. 1984లో రూపొందిన ఈ మలయాళ చిత్రానికి రచన, దర్శకత్వంతో పాటు హీరోగా బాలచంద్ర మేనన్‌ పనిచేశారు. పక్కింటి అమ్మాయిలా కనిపించే శోభన ఈ చిత్రానికి ప్లస్‌ అయింది. ఆ తరువాత ఆమె వరుసగా సినిమాలు చేసింది. అనతి కాలంలోనే కోలీవుడ్​లోకి ప్రవేశించి ఎస్పీ ముత్తురామన్‌ దర్శకత్వంలో 'ఎనక్కుళ్‌ ఒరువన్‌'లో నటించింది. ఈ చిత్రం ఆశించినంత ఫలితం సాధించకపోవడం వల్ల తమిళ చిత్ర పరిశ్రమకు కాస్తంత విశ్రాంతి ఇచ్చి కేవలం మలయాళ చిత్రాలకే పరిమితమైంది.

ఆ తరువాత కొద్ది కాలానికి హీరో సత్యరాజ్‌ సరసన 'మల్లు వట్టి మైనర్‌', 'వాతియార్‌ వేటు పిళ్లై' చిత్రాల్లో నటించింది. భాగ్యరాజా సినిమా 'ఐతు నమ్మ ఆలు'లోనూ నటించింది. విజయకాంత్‌ జోడీగా 'పొన్మాన సెల్వన్‌', 'ఇన్‌ కట్టా మోతతే' చిత్రాల్లో నటించింది. సహజంగానే అందంగా ఉన్న శోభనను తమిళ ప్రేక్షకులు ఆదరించారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి అగ్రశ్రేణి హీరోలతో నటించిన శోభన, ఎందరో దిగ్గజ దర్శకుల దగ్గర పనిచేసింది. ఆదూరు గోపాలకృష్ణన్, జి.అరవిందన్, కె.బాలచందర్, ఏఎమ్‌ ఫాజిల్, మణిరత్నం, భరతన్, రాఘవేంద్రరావు, ఉప్పలపాటి నారాయణరావు, ప్రియదర్శన్‌ ఇలా ఎంతో మంది తీసిన సినిమాల్లో నటించింది.

actress shobana
నటి శోభన

230 సినిమాల హీరోయిన్

శోభన 230 సినిమాల్లో నటించింది. తెలుగులోనూ అగ్ర హీరోలందరితోనూ తెర పంచుకుంది. 1982లో 'భక్త ధ్రువ మార్కండేయ'తో టాలీవుడ్​లోకి అడుగుపెట్టి, తన ఖాతాలో 'శ్రీమతి కానుక', 'విజృంభణ', 'హెచ్చరిక', 'మరణ శాసనం', ‘మువ్వ గోపాలుడు’, ‘అజేయుడు’, ‘త్రిమూర్తులు’, ‘రుద్రవీణ’, ‘అభినందన’, ‘ప్రజా ప్రతినిధి’, ‘కోకిల’, ‘నేటి సిద్దార్ధ’, ‘అగ్ని సాక్షి’, ‘నారి నారి నడుమ మురారి’, ‘రౌడీ అల్లుడు’, ‘అప్పుల అప్పారావు’, ‘హలో డార్లింగ్‌’, ‘రెండిళ్ళ పూజారి’, ‘నాగజ్యోతి’లాంటి చిత్రాలు ఉన్నాయి. అలాగే, ‘విక్రమ్‌’, ‘మార్చండి మన చట్టాలు’, ‘కీచురాళ్లు’, ‘అస్త్రం’, ‘గ్యాంగ్‌ వార్‌’, ‘అల్లుడు దిద్దిన కాపురం’, ‘ముద్దుల మనవడు’, ‘పాపకోసం’, ‘అల్లుడుగారు’, ‘రౌడీగారి పెళ్ళాం’, ‘మైనర్‌ రాజా’, ‘మంచి రోజు’, ‘అహంకారి’, ‘అసాధ్యుడు’, ‘ఛాంపియన్‌’, ‘కన్నయ్య-కిట్టయ్య’, ‘నిప్పురవ్వ’, ‘రక్షణ’, ‘సూర్య పుత్రులు’, ‘గేమ్‌’ సినిమాల్లో నటించారు.

పద్మశ్రీ పురస్కారం

కళారంగానికి శోభన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2014లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రెండు జాతీయ పురస్కారాలతో పటు కేరళ రాష్ట్ర ఫిల్మ్ అవార్డును అందుకుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన శోభన ప్రతిభకు గుర్తింపుగా అనేక సాంస్కృతిక సంస్థలు ఎన్నో అవార్డులు, రివార్డులు, పురస్కారాలు, సత్కారాలతో గౌరవించాయి. కేవలం సినిమా, నాట్యంతోనే కాకుండా పలు టీవీ షోలలో న్యాయమూర్తిగా వ్యవహరించింది. 2010లో తమిళంలో విజయ్‌ టీవీలో జోడీ నంబర్‌ సీజన్‌ ఫోర్‌ కార్యక్రమానికి జడ్జ్​గా పనిచేసింది. 2010లో మలయాళం సూర్య టీవీలో సూపర్‌ జోడీ కార్యక్రమానికీ న్యాయమూర్తిగా వ్యవహరించింది. 2015లో మలయాళంలోనే ఢీ త్రీకి, 2017లో మిడుక్కి ప్రోగ్రాంకు న్యాయనిర్ణేతగా పనిచేసింది.

actress shobana
పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న శోభన

చెన్నైలో కళార్పణ

చెన్నైలో కళార్పణ డాన్స్‌ స్కూల్‌ నిర్వహిస్తూ అభిరుచిగల విద్యార్థులకు నాట్యంలో శిక్షణ ఇస్తోంది శోభన. చెన్నై చిదంబరం అకాడమీలో చిత్ర విశ్వేశ్వరన్‌ దగ్గర శోభన శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకుంది. కళకు కులమత ప్రాంతీయ భేదాలు లేవని ఈమె తరచూ చెబుతూ ఉంటుంది. కళ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మనోభావాల్ని ఎంచక్కా తెలియపరచవచ్చని అంటుంది.

actress shobana
నటి శోభన

- పి.వి.డి.ఎన్‌.ప్రకాష్‌

Last Updated : Mar 21, 2020, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.