ETV Bharat / sitara

వెండితెరపైకి మరో మోదీ బయోపిక్! - మోదీ బయోపిక్​

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్​ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. 'ఏక్​ ఔర్​ నరేన్'​ పేరుతో ఈ చిత్రం రానుంది.

modi
మోదీ
author img

By

Published : Mar 4, 2021, 7:55 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితాధారంగా 'ఏక్​ ఔర్​ నరేన్'​ పేరుతో మరో బయోపిక్​ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి మిలాన్​ భోమిక్​ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు.

"ఈ చిత్రంలో రెండు అంశాలను చూపిస్తాం. దేశంలో సోదరభావాన్ని పెంపొందించేందుకు స్వామి వివేకానంద ఏ విధంగా కృషి చేశారు, దేశకీర్తిని అత్యున్నత స్థాయికి మోదీ ఎలా తీసుకెళ్లారు అనే వాటిని ఇందులో చూపిస్తాం. వీరిద్దరూ తమ భావజాలంతో ప్రజలకు సేవ చేస్తూ దేశ కీర్తి ప్రతిష్ఠలను ఉన్నత శిఖరానికి చేర్చారు."

-మిలాన్​ భోమిక్​, దర్శకుడు.

ఇంతకుముందు నిర్భయ ఘటన సినిమాను తెరకెక్కించారు మిలాన్​. కాగా ఈ బయోపిక్​లో మహాభారతం సీరియల్​లో యుద్ధిష్ఠర పాత్ర పోషించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గజేంద్ర చౌహాన్​.. మోదీ పాత్రలో నటించనున్నారు.

మోదీ జీవితాధారంగా ఇప్పటికే రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. 'మనోవిరాగి' పేరుతో ఒకటి రూపొందుతోంది. 'పీఎమ్​ నరేంద్రమోదీ' పేరుతో మరొకటి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో వివేక్​ ఒబెరాయ్ టైటిల్​ పాత్ర పోషించారు.

ఇదీ చూడండి: మోదీ జీవితాధారంగా రూపొందుతున్న 'మనోవిరాగి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.