Nagarjuna Bigg Boss 5: సినిమా స్టార్స్ అనుకరణ టాస్క్‌లో ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంతో శ్రీదేవిగా చేసిన కాజల్‌కు ఓటు అడిగే అవకాశం లభించింది. దీంతో ఆమె ఎమోషనల్ అయింది. "నా పెర్ఫామెన్స్ నచ్చి, ఇంత దూరం తీసుకొచ్చారు. మొదటి రోజు నుంచి అందరూ చూస్తున్నారు. నేను కొంచెం నచ్చినా ఓటు వేయండి. బిగ్‌బాస్‌కు రావడం నా డ్రీమ్. అది నెరవేరింది. నా ఫ్రెండ్స్‌తో కలిసి టాప్-5లో ఉండాలనుకుంటున్నా" అని కాజల్ ఓటు అప్పీల్ చేసింది. ఆ తర్వాత ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు ఇంటి సభ్యులు సమాధానం చెప్పాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించాడు. నిజాయతీగా సమాధానం చెప్పిన వ్యక్తికి ఓటు అడిగే అవకాశం లభిస్తుందని అన్నాడు. ఆ తర్వాత ఒక్కో ప్రశ్నను టెలివిజన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే చేయడం వల్ల హౌస్‌మేట్స్ వాటికి సమాధానం ఇచ్చారు. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి సగటు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో ఆ ప్రశ్నలన్నీ అందులో ఉన్నాయి. అవే ఈ ప్రశ్నలు..
మీరు షణ్ముఖ్ కన్నా బలమైన ప్లేయర్. కానీ, మిమ్మల్ని మీరు ఎందుకలా గుర్తించుకోవటం లేదు?
సిరి: నేను బలమైన ప్లేయర్‌నని ఒప్పుకుంటా. కానీ, నేను హౌస్‌లోకి వచ్చిన తర్వాత కొన్ని సంఘటనలు ఎదుర్కొన్నా. ఆ సమయంలో షణ్ముఖ్ నాకు అండగా నిలిచాడు. ఒకసారి ఎవరినైనా నమ్మితే ప్రాణం ఇస్తా. షణ్ముఖ్‌తో నేను చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యా. నాకన్నా పైస్థానంలో షణ్ముఖ్‌ను చూడాలనుకుంటున్నా.
అనీ మాస్టర్‌తో మర్యాద గురించి మాట్లాడిన మీరు, తుడిచిన టిష్యూని సన్నీ మీద కొట్టడం మర్యాద అనిపించుకుంటుందా?
కాజల్: గొడవలో అనీ మాస్టర్‌తో వివాదం జరిగింది. సన్నీతో ఉన్న చనువుతోనే అలా చేశా. సన్నీ అంటే నాకు చాలా మర్యాద. అయితే, కాస్త చనువు ఎక్కువ.
గిల్టీ బోర్డు వేసుకుని తిరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ సంఘటన తర్వాత మీ కాన్ఫిడెన్స్ ఎలా తిరిగి పొందారు?
సన్నీ: గిల్టీ బోర్డు వేసుకున్నప్పుడు చాలా బాధపడ్డా. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా హౌస్‌మేట్స్‌కు వచ్చిన అభిప్రాయాన్ని నేను తప్పుపట్టను. ఆ సమయంలో నేను కోపంతో ఉన్నా. కొన్ని మాటలు విన్న తర్వాత నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. జనాల నుంచి వచ్చిన ధైర్యం, వీకెండ్స్‌లో నాకు వచ్చిన అభినందనలు నాలో కాన్ఫిడెన్స్ నింపాయి. అదే నన్ను ముందుకు నడుపుతోంది. నన్ను నేను అద్దంలో చూసుకుని ‘కమాన్ సన్నీ’ అనుకుంటున్నా.
జెస్సీ ఇష్యూ జరిగినప్పుడు షణ్ముఖ్ పరిపక్వత లేని వ్యక్తి అని చెప్పారు. కానీ, ర్యాంకింగ్స్ టాస్క్‌లో మీరే షణ్ముఖ్ పరిపూర్ణ వ్యక్తి అని అతనిని 2వ స్థానంలో నిలబెట్టారు. మీ అభిప్రాయం ఎందుకు మారింది? ఇప్పుడు మీరు షణ్ముఖ్ గ్రూప్‌లో ఉన్నారా?
శ్రీరామ్: నేను ఏ గ్రూప్‌లోనూ లేను. జెస్సీతో గొడవ జరిగినప్పుడు షణ్ముఖ్‌తో పెద్దగా పరిచయం లేదు. అప్పుడు నేను రెండు వైపుల స్టోరీ తెలుసుకుని స్పందించి ఉంటే బాగుండేది. సమయంలో తను ఫ్రెండ్ కోసం స్టాండ్ తీసుకున్నాడు. ఇప్పుడు నాకు తెలిసిన షణ్ముఖ్ వేరు. మా మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ మొదలైంది. అందుకే పరిపూర్ణత వచ్చిన వ్యక్తిగా కనిపించడం వల్ల 2వ స్థానంలో పెట్టా.
ఆడియన్స్ దగ్గర మంచి మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్‌లా వాడుకుంటున్నాడు. మీకు అనిపించటం లేదా?
మానస్: ఫ్రెండ్‌లా వాడుకుంటున్నాడన్నది సరైన ఆలోచన కాదు. ఈ జర్నీలో మా మధ్య అనుబంధం పెరుగుతూ వెళ్లింది. ఆ ఆలోచన రాలేదు. నిజాయతీగా కనెక్ట్ అయిన వ్యక్తి సన్నీ. ఫ్రెండ్స్‌కు ఎంత విలువ ఇస్తాడో, వాళ్లను సేవ్ చేసినప్పుడు సన్నీ రియాక్షన్ చూస్తే మీకు తెలుస్తుంది. ఒకరిని వాడుకుని పైకి రావాలన్న మనస్తత్వం సన్నీకి ఎప్పుడూ లేదు. నాకూ లేదు. నాకెప్పుడూ అలా అనిపించదు. ఒకవేళ మీకు అనిపిస్తే ఆ ఆలోచన మార్చుకోండి.
సిరి అంటే మీరెందుకు సొంత వ్యక్తిలా ఫీలవుతారు. మీరు సిరిని ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు? ఆమెను తనలా ఎందుకు ఉండనివ్వరు?
షణ్ముఖ్: ఈ ప్రశ్న వస్తుందని నేను అనుకున్నా. నా సొంత వ్యక్తిలా భావిస్తున్నానని నాకూ తెలుసు. కొన్ని విషయాల్లో కంట్రోల్ చేస్తే బాగుంటుందని, ఇంకొన్ని విషయాల్లో తనని వదిలేస్తే బాగుంటుందని అనుకున్నా. ఇక్కడే కాస్త తికమకపడ్డా. ఆ క్రమంలో ఆమెపై కొన్నిసార్లు అరిచాను. నాకన్నా తనే నన్ను అర్థం చేసుకుంది. పూర్తి పరిపక్వత చెందిన వ్యక్తి. గేమ్‌లో ఆమెను ఎప్పుడూ కంట్రోల్ చేయలేదు. బయట ఎవరైతే ఆమె మీద గేమ్ ఆడాలనుకుంటున్నారో ఆ సమయంలో కంట్రోల్ చేస్తాను. ఆమెను టాప్-5లో చూడాలనుకుంటున్నా!
అందరి ముందు కాజల్‌ను ఎందుకు అగౌరవపరుస్తారు/ఆటపట్టిస్తారు? మీకోసం నిలబడి ఎవిక్షన్ ఫ్రీపాస్ గెలిచింది కదా!
సన్నీ: సరదాగా ఆటపట్టించాను. మేమెప్పుడూ ఒక స్నేహితురాలిగా చూస్తా. ఆమె ఎప్పుడైనా బాధపడుతుందని అనిపిస్తే, దాన్ని అక్కడితో ఆపేసేవాళ్లం. మీరు అలా అన్నారు కాబట్టి, ఆమెను ఇంకొంచెం ఎక్కువ ఏడిపిస్తా(నవ్వులు)
మీరు రవిని నామినేట్ చేశారు. ఇంకా ఆయనికి ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అనే పేరు కూడా ఇచ్చారు. మరి టికెట్ టు ఫినాలే టాస్క్‌లో ‘రవి నీకోసం ఆడుతున్నాం. మిస్ యు రవి’ అని అనడం కరెక్టేనని మీరు అనుకుంటున్నారా?
సిరి: మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు కదా! రవి ఉన్నప్పుడు చెల్లిలా చూసేవాడు. ఆ వీక్ రవి వెళ్లిపోతాడని అనుకోలేదు. అతను ఎలిమినేట్ అయ్యే సరికి బాధగా అనిపించింది. ఆ గేమ్ ఆడుతున్నప్పుడు రవి గుర్తొచ్చాడు. అతని కోసం ఆడాలనిపించింది. వ్యక్తిగతంగా అతనిని మిస్ అయ్యాను. అంతకు మించి ఏమీ లేదు.
ఇవి ఎలా నచ్చుతున్నాయి.. అవి ఎలా నచ్చుతున్నాయి.. అని ఆడియన్స్‌ని ఎందుకు జడ్జి చేస్తున్నారు. వారిపై ఫన్ ఎందుకు చేస్తున్నారు?
షణ్ముఖ్: అది నా ఊహ మాత్రమే. 24 గంటల్లో జరిగిన వివిధ సంఘటనలను నేను పరిశీలిస్తా. నాకు నచ్చని పాయింట్లు బయట వాళ్లకు నచ్చుతున్నాయో లేదోనని ఆలోచిస్తా. ఆ ఊహా తప్పా? కరెక్టా?అనేది నాకు తెలియదు. ఆడియన్స్ మీద ఫన్ చేద్దామన్న ఉద్దేశం లేదు. మీరు అలా తీసుకుని ఉంటే క్షమించండి.
మీరు మొదటి నుంచి గ్రూప్‌లోనే ఆడుతూ వచ్చారు. కానీ, మిమ్మల్ని మీరు ఒంటరి వ్యక్తి అని పైకి చెప్పుకుంటున్నారు. సానుభూతి పొందడానికి మీ ప్రణాళికా? ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో మీరు, రవి కూడా ఇద్దరి ఫొటోలు కాల్చేయాలని ప్లాన్ వేశారు. కానీ, కాజల్ అదే పని చేస్తే మీకు ఎందుకు కోపం వచ్చింది?
శ్రీరామ్: నన్ను నేను ఎప్పుడూ ఒంటరి వాడిని అనుకోలేదు. సానుభూతి పొందాలన్న ఆలోచన లేదు. అంత ఘోరంగా ఆలోచించలేదు. అందరితోనూ కలిసి ఆడాలనే చూస్తా. ఫైర్ స్టేషన్ గేమ్‌లో అలా ఆడవచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే, నేను ఓవర్‌గా రియాక్ట్ అయ్యనేమోనని అనిపించింది. కాజల్ గెలిచిన విధానం సరిగా అనిపించలేదు. ఫొటోలు కాల్చేద్దామన్న దానిపై రవితో మాట్లాడలేదు. అందరూ నిజాయతీగా ఆడదామనుకుని అలా ఎందుకు చేశారన్న కోపం వచ్చింది.
ప్రియాంక మీ స్నేహితురాలు అనుకున్నప్పుడు మీరు ఆమెను ఎందుకు తక్కువ చేసి చూశారు?
మానస్: కొన్నిసార్లు ప్రియాంక ప్రవర్తన నచ్చనప్పుడు దాన్ని ఆమెతో పంచుకునేవాడిని. అది మీకు తప్పుగా అనిపిస్తే, అది నా తప్పు. ఒక ఫ్రెండ్ గురించి నచ్చని విషయాలు చెప్పకూడదు. నేనెప్పుడూ ప్రియాంక మంచి కోరే వాడినే. ఆమెను కిందకు లాగాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రియాంకను ఏమైనా హర్ట్ చేసి ఉంటే క్షమించాలి.
మీరు మొదట షణ్ముఖ్‌తో ఫ్రెండ్‌లా ఉండేవారు. ఆ తర్వాత రవితో, ఇప్పుడు సన్నీ ఇంకా మానస్‌తో ఉన్నారు. కేవలం ఆటలో ముందుకు వెళ్లడానికి ఇలా ఫ్రెండ్లీగా ఉంటున్నారా?
కాజల్: మొదట నాకు షణ్ముఖ్ బాగా నచ్చేవాడు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం కారణంగా దూరంగా జరిగా. రవితో ఎప్పుడూ ఫ్రెండ్‌గా కనెక్ట్ కాలేదు. ఈ హౌస్‌లోకి వచ్చిన తర్వాత మొదట ఫ్రెండ్‌గా భావించింది మానస్‌నే. ఆ తర్వాత సన్నీ కనెక్ట్ అయ్యాడు. కేవలం ఆట కోసమే వాళ్లతో కనెక్ట్ కాలేదు.
నిజాయతీ ఎవరు జవాబులు చెప్పారన్న దానిపై ఇంటి సభ్యుల మధ్య చర్చ జరిగింది. సిరి-సన్నీల మధ్య టై అవ్వగా చివరకు ఏకాభిప్రాయంతో ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం సన్నీకి లభించింది. అయితే, ఈ విషయమై శ్రీరామ్-సన్నీల మధ్య తీవ్ర చర్చ జరిగింది. ఒకసారి కాకపోతే మరొకసారైనా తనని గుర్తించటం లేదని సన్నీ వాపోయాడు. మరోవైపు ఎలాంటి చర్చకు తావు ఇవ్వకుండా ఓటు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని సిరి వదిలేసుకోవడంపై శ్రీరామ్ అసహనం వ్యక్తం చేశాడు. 'ఓటు అడిగే అవకాశం నాకూ కావాలి' అని ఎందుకు ఫైట్ చేయలేదని సిరిని ప్రశ్నించాడు. అనవసరంగా సన్నీ దృష్టిలో చెడ్డవాడిని అయ్యానని అన్నాడు. తాను అగ్రెసివ్ కాదని, అందరితో స్నేహంగా ఉంటానని తనని గెలిపించాలని సన్నీ ప్రేక్షకులను కోరాడు. తనతో పాటు తన స్నేహితులకూ ఓటు వేయాలని సన్నీ విజ్ఞప్తి చేశాడు.
ఇదీ చూడండి: గ్లామర్ బ్యూటీ శ్రద్ధాదాస్ అందాలు చూడాల్సిందే!