Alia bhatt ranbir kapoor: ఆలియా భట్ తన జీవితంలో పటాకాలాంటిదని బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ చెప్పారు. బిగ్‌బాస్ సీజన్-5 ఫినాలే సందర్భంగా 'బ్రహ్మాస్త్ర' టీమ్ వచ్చి హౌస్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా రణ్‌బీర్ ఆలియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అలియాభట్ తన జీవితంలో లక్ష్మీబాంబు అని, ఎప్పుడూ ఎనర్జీతో ఉంటుందని, తాను మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటానని రణ్‌బీర్ కపూర్ అన్నారు. బిగ్‌బాస్ సీజన్-5లో ఎవరు విజేతగా నిలిచినా అందరూ తమ స్నేహబంధాలను కొనసాగించాలని హౌస్‌మేట్స్‌కు సూచించారు.
'బ్రహ్మాస్త్ర' కథ చెప్పగానే చాలా నచ్చేసిందని, వెంటనే తాను భాగస్వామి అయ్యేందుకు ఒప్పుకొన్నానని డైరెక్టర్ రాజమౌళి అన్నారు. అయాన్‌ను చూసి 'ఇతనేంటి నాకంటే పెద్ద సినిమా పిచ్చోడులా ఉన్నాడు' అనుకున్నానని అన్నారు. ఎస్.ఎస్. రాజమౌళిలో ఎస్.ఎస్. అంటే శ్రీశైల శ్రీ రాజమౌళి అన్న ఆయన.. అదే ఇంగ్లీష్‌లో S అంటే సక్సెస్.. మరో S అంటే స్టుపిడ్ అంటూ నవ్వులు పంచారు.
వాళ్లిద్దరినీ ఒకే తెరపై చూడటం అద్భుతమైన అనుభూతి
"ఇండస్ట్రీలో టాప్‌స్టార్స్ మధ్య ఎంత ఫ్రెండ్‌షిప్ ఉంటుందో మాకు తెలుసు. ఇద్దరు స్టార్‌ల ఫ్యాన్స్‌ను కలిపితే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. తారక్, చరణ్‌ను ఒక తెరపై చూపించటం అదొక అద్భుతమైన అనుభూతి. నాకు చిన్నప్పటి నుంచి రెండు వేర్వేరు ప్రపంచాలకు చెందిన హీరోలను కలపడం ఇష్టం. మహాభారతంలో కర్ణుడు, రామాయణంలో హనుమంతుడిని కలిపి చూపించటం ఇష్టం. వాళ్ల మధ్య స్నేహం, మనస్పర్థలు ఏది ఉన్నా బాగుంటుంది. అలాంటి అవకాశమే 'ఆర్‌ఆర్ఆర్'తో వచ్చింది. ఒకవైపు అల్లూరి సీతామరాజు, మరొక వైపు కొమరం భీం పాత్రను చూపించా. గొప్ప వ్యక్తుల మధ్య స్నేహం ఉంటే ఎలా ఉంటుందన్నది మాత్రమే చూపించాం" అని 'ఆర్ఆర్ఆర్' గురించి రాజమౌళి చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి: