ETV Bharat / sitara

ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించా: బిగ్​బాస్ భామ

తాను ఓ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు చెప్పింది బిగ్​బాస్ ఫేమ్ నందినిరాయ్. అందుకు గల కారణాల్ని ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించా: బిగబాస్ భామ
నందిని రాయ్
author img

By

Published : Jun 24, 2020, 1:25 PM IST

ఒత్తిడి తట్టుకోలేక, అవకాశాలు రాకపోవడం వల్ల తాను ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు చెప్పింది బిగ్​బాస్ ఫేమ్, నటి నందినిరాయ్. ఇటీవలే బాలీవుడ్​ నటుడు సుశాంత్ సింగ్ సుసైడ్ చేసుకుని మృతి చెందిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన డిప్రెషన్​కు సంబంధించిన విషయాల్ని పంచుకుంది.

actress nandini rai
నటి నందిని రాయ్

"2011లో ఇండస్ట్రీలోకి వచ్చాను. 2015లో 'మోసగాళ్లకు మోసగాడు'లో హీరోయిన్​గా అవకాశమొచ్చింది. అయితే ఆ సినిమా పరాజయం పాలవడం వల్ల పూర్తిగా నిరాశచెందాను. దీంతో డిప్రెషన్​లోకి వెళ్లిపోయాను. ఒకానొక సమయంలో ఇంటి టెర్రస్​పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను. దాదాపు రెండేళ్లపాటు మానసిక ఒత్తిడిని అనుభవించాను. అయితే బిగ్​బాస్ రెండో సీజన్​లో పాల్గొని వచ్చిన తర్వాత నన్ను నేను దృఢంగా మార్చుకున్నాను. స్నేహితులతో రోజూ మాట్లాడుతూ ఉండేదాన్ని. డాక్టర్ల దగ్గర కౌన్స్​లింగ్​లకు హాజరయ్యేదాన్ని. ఇలా ఈ సమస్య నుంచి బయటపడ్డాను" -నందిని రాయ్, నటి

'సిల్లీ ఫెలోస్', 'శివరంజని' వంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించిన నందిని రాయ్.. 2018లో వచ్చిన 'బిగ్​బాస్-2'​లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.