ఎలిమినేషన్ ప్రక్రియతో వారాంతంలో 'బిగ్‌బాస్'(nagarjuna bigg boss) హౌస్ ఉత్కంఠగా మారింది. ఎలిమినేషన్‌లో ఉన్న 8 మందిలో నలుగురు సేఫ్ జోన్‌లోకి(bigg boss contestants telugu) రాగా.. మిగిలిన నలుగురిలో ఎవరు ఈ వారం హౌస్‌ని విడతారోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జునకు ఇంటి సభ్యులందరూ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. నాగార్జున నటించిన ఎవర్‌గ్రీన్ ఫీల్ గుడ్ మూవీ 'నిన్నే పెళ్లాడతా'(nagarjuna ninne pelladatha cinema) విడుదలై 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా హౌస్‌మేట్స్ అందరూ కలిసి అందులోని పాటలకు డ్యాన్స్ చేసి మెప్పించారు. ఇంటి సభ్యులు ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో తనకి ఆనాటి రోజులు గుర్తుకువచ్చాయని.. భావోద్వేగంతో కన్నీళ్లు వస్తున్నాయని నాగ్ అన్నారు.
అనంతరం.. 'విశ్వని అన్నయ్య అంటే అన్నావు కానీ.. సన్నీని మాత్రం అన్నయ్య అనొద్దు' అంటూ ప్రియాంకతో నాగార్జున సరదాగా అన్నారు. ఈ క్రమంలోనే విశ్వ-ప్రియాంక డ్యాన్స్ చేయగా.. 'మీ ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్నంతసేపు నేను మానస్ రియాక్షన్స్ చూస్తూనే ఉన్నాను' అని నాగ్ కామెంట్ చేశారు. దీంతో ప్రియాంక.. మానస్‌ను పట్టుకోవడానికి ఆయన వెంట పరిగెత్తడం.. అదుపుతప్పిన ఆయన ఒక్కసారిగా స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోవడంతో నాగ్ షాక్ అయ్యారు. మరోవైపు ఈ వారం ఎవరు ఇంటిని వీడుతున్నారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే..!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: