కరోనా తర్వాత ఓటీటీకి బాగా అలవాటు పడిపోయాం. ఎంతలా అంటే ఒకప్పుడు ఏ థియేటర్లో ఏ సినిమా వస్తుందా, ఎవరెవరితో కలిసి వెళ్దామా అని ప్లాన్స్ వేసే మనం.. ఇప్పుడు ఓటీటీలో ఏ కొత్త సినిమా వస్తుందా అని ప్రతి శుక్రవారం ఎదురుచూస్తున్నాం.
ఓటీటీలో తెలుగు సినిమా రిలీజ్ అనేసరికి మిగతా భాషా చిత్రాల కంటే ఇంకాస్త ఆసక్తి చూపిస్తాం. మరి ఈ నెల తెలుగులో ఓటీటీ వేదికగా ఏయే సినిమాలు విడుదలవుతున్నాయి. వాటి సంగతేంటి చూసేద్దామా!
నాని 'టక్ జగదీష్'
హీరో నాని గత చిత్రం 'వి'.. గతేడాది ఓటీటీలోనే విడుదలైంది. ఇప్పుడు కొత్త సినిమా 'టక్ జగదీష్'(nani tuck jagadish) కూడా ఇలానే అభిమానుల ముందుకొస్తోంది. వినాయక చవితి కానుకగా వస్తుండటం వల్ల ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఎదురుచూస్తున్నారు. కుటుంబ కథతో తెరకెక్కడం వల్ల ఎక్కువమందికి ఈ చిత్రం రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అలరిస్తూ, సినిమాపై అంచనాల్ని మరికాస్త పెంచుతుంది. మరి ఏమవుతుందో చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రాహుల్ రామకృష్ణ 'నెట్'
థ్రిల్లర్ కథతో తెరకెక్కిన సినిమా 'నెట్'(net movie). రాహుల్ రామకృష్ణ, అవికా గోర్ ప్రధానపాత్రల్లో నటించారు. అవికాను నిత్యం ఫోన్లో గమనిస్తుంటాడు రాహుల్. దీనికి ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొన్నాడు. చివరకు ఏమైంది తెలియాలంటే సెప్టెంబరు 10 వరకు ఆగాల్సిందే. జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నితిన్ 'మాస్ట్రో'
నితిన్(nithin maestro) కెరీర్లోనే ఓటీటీలో విడుదలవుతున్న తొలి చిత్రమిది. అలానే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కూడా తెలుగు సినిమాను తమ ఓటీటీలో నేరుగా రిలీజ్ చేయడం ఇదే తొలిసారి.
బాలీవుడ్ హిట్ 'అంధాధున్'కు(andhadhun) రీమేక్ తీసిన ఈ సినిమా నితిన్ అంధుడిగా నటించాడు. తమన్నా(tamannah maestro) ప్రతినాయక లక్షణాలున్న పాత్ర పోషించింది. నభా నటేష్ హీరోయిన్. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అలరిస్తూ అంచనాల్ని పెంచుతోంది. సెప్టెంబరు 17 నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
విజయ్ సేతుపతి 'అన్నాబెల్లీ' గెటప్‌లో
విజయ్ సేతుపతి, తాప్సీ జంటగా నటించిన కామెడీ థ్రిల్లర్ 'అన్నాబెల్లీ సేతుపతి'(vijay sethupathi annabelle movie). ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈనెల 17నే విడుదల కానుంది.
ఇవే కాకుండా ఇతర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: