ETV Bharat / sitara

'మీరు త్వరగా కోలుకోవాలి అమితాబ్​' - bollywood reax on abhishek covid positive

బాలీవుడ్ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​, ఆయన కుమారుడు అభిషేక్​ బచ్చన్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయం తెలుసుకున్న సన్నిహితులు, అభిమానులు సహా సినీ ప్రముఖులు, క్రికెటర్లు ఆయనకు ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్​ చేశారు.

Big B, Abhishek test COVID-19 positive: Film industry prays for father-son duo's speedy recovery
అమితాబ్​ బచ్చన్​,
author img

By

Published : Jul 12, 2020, 7:55 AM IST

Updated : Jul 12, 2020, 10:07 AM IST

బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో సినీ ఇండస్ట్రీలో ఆందోళన నెలకొంది. అమితాబ్​తో పాటు ఆయన కుమారుడు, బాలీవుడ్ హీరో అభిషేక్​ బచ్చన్​కూ వైరస్​ సోకింది. ఈ విషయాన్ని అమితాబ్​, అభిషేక్ స్వయంగా వెల్లడించారు. తాజాగా.. బిగ్​బీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఐసోలేషన్​ వార్డులో చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే సన్నిహితులు, అభిమానులు సహా సినీ ప్రముఖులు, క్రీడాకారులు బిగ్​బీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ఆయనకు ధైర్యం చెప్పారు.

"త్వరగానే మీరు ఆరోగ్యవంతులవుతారు" అంటూ మలయాళం సూపర్​స్టార్​ మమ్ముట్టి అన్నారు.

ప్రముఖ సినిమా దర్శకుడు కునాల్​ కోహ్లీ స్పందిస్తూ.. "జాగ్రత్త సర్​. లవ్​ యూ మీరు బాగున్నారని త్వరగా చెప్పాలని ట్వీట్​ కోసం ఎదురు చూస్తున్నా." అంటూ ట్వీట్​ చేశారు. సినీ నటి బిపాసా బసు, సూపర్​స్టార్​ మహేశ్​ బాబు, దుల్కర్​ సల్మాన్​, పంకజ్​ తిరుపతి, నిమ్రత్​ కౌర్​, హన్సర్​ మెహ్తా తదితరులు బిగ్​బీకి మద్దతుగా నిలిచారు.

"త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా అమిత్​ అంకుల్"​ అంటూ సోనమ్​ కపూర్​ ట్విట్టర్​ వేదికగా తెలిపారు. తాప్సీ పన్ను, షాహిద్​ కపూర్​లు కూడా అమితాబ్​కు ధైర్యం చెప్పారు.

క్రికెటర్ల మద్దతు..

అమితాబ్​ త్వరగా కోలుకోవాలని దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందుల్కర్​ ఆకాంక్షించారు. జాగ్రత్త వహించాలని సూచించారు. మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ కూడా బిగ్​బీకి మద్దతుగా నిలిచారు.

  • Wishing you a speedy recovery @SrBachchan. The prayers and good wishes of the entire country are behind you. You have always been a fighter and will see this through too with your will power and resilience. Hope you get well really soon ❤️🙏🏻 https://t.co/39yqi3Mb0b

    — Yuvraj Singh (@YUVSTRONG12) July 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"దేశమంతా మీ వెనక ఉంది, మీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తోంది. మీరు జీవితమంతా ఒక యోధుడిలా పోరాడారు. ఈ సమస్యను కూడా అదే సంకల్ప శక్తితో అధిగమిస్తారని భావిస్తున్నా"

-యువరాజ్​ సింగ్​, టీమిండియా మాజీ క్రికెటర్​

మరోవైపు జయా బచ్చన్, ఐశ్వర్యరాయ్​ బచ్చన్​, ఆరాధ్య.. తదితర సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్​గా​ తేలినట్లు సమాచారం.

కరోనాపై అవగాహన..

కరోనాపై అవగాహన కల్పించేందుకు అమితాబ్​ ఎంతో కృషి చేశారు. ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్​తో పాటు తన బ్లాగ్​లో తరచూ పోస్ట్​ చేస్తూ.. పలు అంశాలపై అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

బిగ్​బీ చివరగా సూజిత్​ సర్కార్​ తెరకెక్కించిన 'గులాబో సితాబో'లో వినూత్న పాత్రలో కనిపించారు. జూన్​లో స్ట్రీమింగ్​ ప్లాట్​ఫాం అమెజాన్​ ప్రైమ్​లో విడుదలైంది.

ఇదీ చదవండి:'విప్లవానికి పునాది ప్రేమ.. అదే 'విరాటపర్వం"

Last Updated : Jul 12, 2020, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.