యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్.. కలిసి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సిద్ధమయ్యారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ త్వరలో 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది. నేడు ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసింది. భారీ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.
-
Proud to associate with #Prabhas for our prestigious project directed by @nagashwin7.https://t.co/WYEptLI3MF#PrabhasNagAshwin
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Proud to associate with #Prabhas for our prestigious project directed by @nagashwin7.https://t.co/WYEptLI3MF#PrabhasNagAshwin
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 26, 2020Proud to associate with #Prabhas for our prestigious project directed by @nagashwin7.https://t.co/WYEptLI3MF#PrabhasNagAshwin
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 26, 2020
ప్రస్తుతం 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న డార్లింగ్.. త్వరలోనే నాగ్ అశ్విన్ బృందంతో కలిసి పనిచేయనున్నాడు. రాధాకృష్ణ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమాకు 'రాధే శ్యాం', 'ఓ డియర్', అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. 1930 నాటి ప్రేమ కథ నేపథ్యంలో కథాంశం ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మహానటి' చిత్రం విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. అశ్వినీదత్ నిర్మించగా, ఈ చిత్రంలో నటించిన కీర్తి సురేష్ జాతీయ అవార్డు దక్కించుకుంది. వైజయంతి సంస్థ 'మహర్షి' సినిమాతో గతేడాది భారీ హిట్టు అందుకుంది.