ETV Bharat / sitara

బాలీవుడ్​లో 'ధమ్' చూపించిన భూమి - bhumi pednekar

'ధమ్​ లగాకే హైషా' చిత్రంతో బాలీవుడ్  అరంగేట్రం చేసి.. 'టాయ్​లెట్ ఏక్​ ప్రేమ్​ కథ' లాంటి సామాజిక చైతన్యం కలిగించే సినిమాలో మెప్పించి.. 'శుభ్​మంగళ్​ సావ్​ధాన్'​తో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న నటి భూమి పడ్నేకర్. నేటితో 30 సంవత్సరాలు పూర్తిచేసుకుని 31వ పడిలోకి అడుగుపెడుతోన్న ఈ బాలీవుడ్​ నటిపై ఓ లుక్కేద్దాం!

భూమి పడ్నేకర్
author img

By

Published : Jul 18, 2019, 10:26 AM IST

Updated : Jul 18, 2019, 12:18 PM IST

భూమి పడ్నేకర్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా బాలీవుడ్​లో సుపరిచితమే. వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటోన్న నటి. అసిస్టెంట్ క్యాస్టింగ్ డైరెక్టర్​గా చిత్రసీమలో అడుగుపెట్టి అనంతరం హీరోయిన్​గా మారి, తక్కువ కాలంలోనే స్టార్​ కథానాయికగా గుర్తింపుతెచ్చుకుంది. 1989 జులై 18న జన్మించిన భూమి నేటితో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 31వ పడిలో అడుగుపెడుతోంది.

బ్యాక్​గ్రౌండ్:

ముంబయిలో జన్మించిన భూమి జూహూలోని ఆర్య విద్యామందిర్​లో చదువుకుంది. అనంతరం యశ్ రాజ్ ఫిల్మ్స్​ నిర్మాణ సంస్థలో అసిస్టెంట్​ క్యాస్టింగ్ డైరెక్టర్​గా ఆరేళ్లు పనిచేసింది.

సినీ అరంగేట్రం..

యశ్ రాజ్ ఫిల్మ్స్​ బ్యానర్​లో వచ్చిన 'ధమ్​ లగాకే హైషా' చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది. ఆయుష్మాన్ హీరోగా 2015లో విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్టైంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంలోని హీరోయిన్​ పాత్ర కోసం 12 కేజీల బరువు పెరిగింది. ఈ విజయంతో భూమికి బాలీవుడ్​లో వరుసపెట్టి ఆఫర్లు వచ్చాయి. అనంతరం యశ్ రాజ్ బ్యానర్​లోనే 'మ్యాన్స్ వరల్డ్'​ అనే వెబ్​సిరీస్​లో నటించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వెల్లువెత్తిన ఆఫర్లు..

తొలి చిత్రం ఘనవిజయం కావడం వల్ల భూమికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటూ చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అక్షయ్ కుమార్​తో కలిసి సందేశాత్మక చిత్రమైన 'టాయ్​లెట్​ ఏక్ ప్రేమ్​ కథ'లో నటించింది. ఈ చిత్రమూ ఘనవిజయం సాధించింది. అనంతరం ఆయుష్మాన్​తో నటించిన 'శుభ్​మంగళ్ సావధాన్'​తో హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. 'లస్ట్​ స్టోరీస్'​లో చిన్నపాత్రైనా.. సినీప్రియులకు గుర్తుండిపోయే నటనతో మెప్పించింది. ఈ ఏడాది 'సాంచారియా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది భూమి.

భవిష్యత్ ప్రాజెక్టులు..

త్వరలో 'డోలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే'తో సందడి చేయనుంది. తాప్సీతో కలిసి 'సాంఢ్​ కీ ఆంఖ్', 'భూత్ పార్ట్​ వన్: ద హాంటడ్ షిప్', 'బాలా', 'పతీ పత్నీ ఔర్ వో' సినిమాలు చేస్తోంది. ఈ చిత్రాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

అవార్డులు..

ధమ్ లగాకే హైషా చిత్రానికి ఉత్తమ అరంగేట్ర కథానాయికగా ఫిల్మ్​ఫేర్​తో పాటు పలు పురస్కారాలు అందుకుంది. టాయ్​లెట్​ ఏక్ ప్రేమ్ కథ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్​ ఫౌండేషన్ అవార్డును దక్కించుకుంది భూమి.

ఇది చదవండి: సినీడైరీ: కాళిదాసు దర్శకుడికి.. కారు కూడా లేదు!

New Delhi, Jul 17 (ANI): Google's controversial Dragonfly project, aimed at launching a search engine customised for China, has been officially shut down. Google's VP of Public Policy Karan Bhatia told the US Senate that the much-criticised project has been terminated. However, Bhatia highlighted that it is not a new development and the first public mention was back in March, BuzzFeed reported. He further stressed that Google has no plans to launch a censored search in China and that no work is being undertaken on such a project.
Last Updated : Jul 18, 2019, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.