ETV Bharat / sitara

హీరో బాలకృష్ణకు విలన్​గా భూమిక!

author img

By

Published : Apr 11, 2020, 3:14 PM IST

బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్​లో తెరకెక్కుతున్న సినిమాలో ప్రతినాయకురాలి పాత్రలో భూమిక నటించనుందని టాక్​. ప్రస్తుతం చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

Bhoomika turns into villan for Balakrishna
బాలయ్య కోసం ఆ పాత్రలో భూమిక!

నటసింహం నందమూరి బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను అంటే ముందుగా గుర్తొచ్చేవి పవర్​ఫుల్ డైలాగ్​లు, భయపెట్టే విలన్లు. 'సింహా', 'లెజెండ్​' సినిమాలతో అలరించిన ఈ కాంబో.. మూడో చిత్రం కోసం కలిసి పనిచేస్తున్నారు. అయితే ఇందులో విలన్​గా సీనియర్ హీరోయిన్ భూమిక కనిపించనుందని సమాచారం. త్వరలో ఈ విషయంపై స్పష్టత రానుంది.

గతంలో బాలయ్య 'రూలర్‌'లోనూ కీలక పాత్రలో మెరిసింది భూమిక. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి నటిస్తుడటం, అదీ ప్రతినాయకురాలి పాత్ర కావడం వల్ల అందరిలో ఆసక్తి నెలకొంది.

మొదటి షెడ్యూల్​ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి, కరోనా రూపంలో అవాంతరం ఎదురైంది. దీంతో షూటింగ్​ను నిలిపేయాల్సి వచ్చింది.

ఇదీ చూడండి : ఈ సెలబ్రిటీ భార్యభర్తలు అల్లరే అల్లరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.