భోజ్‌పురి నటి, డ్యాన్సర్ త్రిషాకర్ మధు ప్రైవేట్ వీడియో సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. నటి త్రిషాకర్.. తన బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశాడు. ఈ విషయమై నెటిజన్లు ఆమె ట్రోల్ చేస్తున్నారు.
అయితే.. నెటిజన్ల తీరుపై త్రిషాకర్ అసహనం వ్యక్తం చేసింది. ఈ వీడియోను వైరల్ చేసిన వారిని ఆమె ట్విట్టర్ ద్వారా హెచ్చరించింది.
" దేవుడు అంతా చూస్తున్నాడు. నా పరువు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు ఇలా వీడియో వైరల్ చేశారు. కొంతమంది ప్రజలు ఇలా ఆలోచిస్తారని నేను అనుకోలేదు"అంటూ త్రిషాకర్ రాసుకొచ్చింది.
త్రిషాకర్ స్వస్థలం బంగాల్. 'హమ్ హై హిందుస్థాన్' సీరియల్ ద్వారా భోజ్‌పురి చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. ఎంతోమంది అగ్రహీరోలతో కలిసి ప్రత్యేక గీతాల్లో అలరించారు.
ఇదీ చదవండి: రికార్డులతో దూసుకెళ్తోన్న 'పుష్ప' సాంగ్