ETV Bharat / sitara

వాళ్లే నా పంచ ప్రాణాలు: నితిన్

author img

By

Published : Feb 18, 2020, 7:40 AM IST

Updated : Mar 1, 2020, 4:47 PM IST

'అదృష్టం ఆవగింజంత ఉంటే.. దురదృష్టం దబ్బకాయంత ఉంది' అంటూ 'భీష్మ'గా అభిమానుల ముందుకొస్తున్నాడు నితిన్‌. ఈ చిత్ర ప్రీరిలీజ్​ ఈవెంట్​ సోమవారం హైదరబాద్​లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్​ హాజరయ్యాడు.

bheeshma movie pre release event: Thrivikram-is-my-torchberer-says-nitin
త్రివిక్రమ్​ నాకు టార్చ్​ బేరర్ లాంటివాడు​: నితిన్​

టాలీవుడ్​ యువ కథానాయకుడు నితిన్​ హీరోగా నటించిన 'భీష్మ' సినిమా ప్రీరిలీజ్‌ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సినిమా బృందం చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

అభిమానులకు కడుపు నిండా డ్యాన్స్‌..

హీరో నితిన్‌ మాట్లాడుతూ.. "నా లైఫ్‌లో పంచప్రాణాలంటే మా అమ్మ, నాన్న, అక్క. ఆ తర్వాత పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్ శ్రీనివాస్‌. ఇప్పుడు నాకు పెళ్లి కాబోతోంది కాబట్టి నా లైఫ్‌లోకి రాబోతున్న నా భార్య నా ఆరోప్రాణం. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నాకు టార్చ్‌ బేరర్‌ లాంటి వాడు. చివరి సినిమాకు ఈ సినిమాకు ఏడాదిన్నర గ్యాప్‌ వచ్చింది. ఈ గ్యాప్‌ ఎందుకొచ్చిందంటే.. మంచి స్టోరీ కోసం ఎదురు చూడటం. సినిమా సెకండ్‌ హాఫ్‌లో అద్భుతమైన ఒక ఫైట్‌ ఉంటుంది. ఆ టైంలో నేపథ్య సంగీతం బాగా అందించాడు సాగర్​. ఆ ఫైట్‌ చూసేటప్పుడు అభిమానులకు గూస్‌బంబ్స్‌ రావడం పక్కా. రష్మిక బాగా నటించింది. 'వాట్టే బ్యూటీ' సాంగ్‌లో ఆమె తప్ప ఎవరున్నా అంత పేరు వచ్చేది కాదు. నిర్మాత చినబాబు, వంశీ.. వీళ్లిద్దరితో కలిసి చేసిన మొదటి సినిమా 'అఆ'. ఇది రెండోది. మూడో సినిమా కూడా ఇప్పటికే ప్రారంభమైంది. నాలుగో సినిమా కోసం వంశీ స్కెచ్‌ గీస్తున్నాడు. షూటింగ్‌లో చాలా సహకరించాడు. ఇది పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. ఫిబ్రవరి 21న థియేటర్లలో హంగామా చేసేందుకు సిద్ధంగా ఉండండి".

వేదికపై మాట్లాడుతున్న నితిన్​

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ..

"నితిన్‌కు వాళ్ల అన్నయ్య పవన్‌కల్యాణ్‌ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది రష్మిక.. భీష్మతో మరో విజయం తన ఖాతాలో వేసుకోబోతోంది. ఇక ఈ సినిమా గురించి మాట్లాడాలంటే.. నాకు బాగా నచ్చిన రెండు అంశాలు. ఒకటి ఫైట్‌, మరోటి 'వాట్టే బ్యూటీ' పాట. ఈ సినిమా అభిమానులను కచ్చితంగా అలరిస్తుందన్న నమ్మకం ఉంది."

దిల్‌రాజు మాట్లాడుతూ.. "సినిమాలో నవ్వులు పక్కా అని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. సినిమా పాటలన్నీ చాలా బాగా ఉన్నాయి. మహతి సంగీతంలో మణిశర్మ వారసుడని అని నిరూపించుకుంటున్నాడు." అన్నాడు.

'భీష్మ' సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. రష్మిక హీరోయిన్​గా నటించింది. మహతి స్వర సాగర్​ సంగీతాన్ని సమకూర్చగా.. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ మూవీలోని పాటలు ఇప్పటికే అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి.. భీష్మ ట్రైలర్: అదృష్టవంతుడితో పోరాడి గెలవలేం

Last Updated : Mar 1, 2020, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.