ETV Bharat / sitara

ఒక రోజు ముందే 'భీమ్లానాయక్'​.. 15వేల టీకప్పులతో తారక్​-చెర్రీ ఆర్ట్​ - భీమ్లానాయక్​ హాట్​స్టార్​ ఓటీటీ రిలీజ్​

పవన్​కల్యాణ్​ 'భీమ్లానాయక్' ఓటీటీ రిలీజ్​ డేట్​లో కాస్త మార్పు జరిగింది. మరోవైపు ఓ అభిమాని 15వేల టీ కప్పులతో అద్భుతంగా ఎన్టీఆర్‌, చరణ్‌ పాత్రలను తీర్చిదిద్దిన వీడియో అబ్బుర పరుస్తోంది.

RRR
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Mar 22, 2022, 8:17 PM IST

Updated : Mar 22, 2022, 8:35 PM IST

Bheemlanayak hotstar ott release: పవన్‌ కల్యాణ్‌, రానా కలిసి నటించిన ‘భీమ్లానాయక్‌’ చిత్రం ఒక రోజు ముందుగానే ఓటీటీల్లో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని మార్చి 25న తమ ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ‘డిస్నీ + హాట్‌స్టార్‌’, ‘ఆహా’ సంస్థలు ప్రకటించాయి. సంగతి తెలిసిందే. తాజాగా ఈ తేదీని మారుస్తూ సినీ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాయి. ‘భీమ్లానాయక్‌ మార్చి 24న రిపోర్ట్‌ చేస్తాడు’ అని ట్వీట్‌ చేశాయి. మలయాళంలో ఘన విజయం అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్‌ సంభాషణలు, స్క్రీన్‌ప్లే అందించారు. నిత్య మేనన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటించారు.

bheemlanayak
భీమ్లానాయక్​

15వేల టీ కప్పులతో

RRR Teacup art: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగెస్ట్‌ మల్టీస్టారర్‌ యాక్షన్ డ్రామా 'ఆర్‌ఆర్‌ఆర్‌'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే థియేటర్ల వద్ద ‘ఆర్ఆర్‌ఆర్‌’ సందడి షురూ అయింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల భారీ కటౌట్‌లు, ఫెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ అభిమాని అద్భుతమైన ఆర్ట్‌తో ఎన్టీఆర్‌, చరణ్‌ పాత్రలను తీర్చిదిద్దిన వీడియో అబ్బుర పరుస్తోంది. 15వేల టీకప్స్‌తో ఆరు రోజుల పాటు శ్రమించి ఒకవైపు రామ్‌చరణ్‌, మరోవైపు ఎన్టీఆర్‌ కనపడేలా వేసిన ఆర్ట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ కూడా స్పందించింది. 'అద్భుతమైన ఆర్ట్. అంతులేని మీ ప్రేమకు ధన్యవాదాలు' అని బదులిచ్చింది.

ఇదీ చూడండి: RRR movie: ఒక్క ఫొటో.. నాలుగేళ్ల ప్రయాణం.. సాగిందిలా

Last Updated : Mar 22, 2022, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.