ETV Bharat / sitara

Bheemla Nayak: 'భీమ్లా నాయక్​'కు సీక్వెల్​పై రానా ఏమన్నాడంటే..? - రానా దగ్గుబాటి

Bheemla Nayak: పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ నటించిన 'భీమ్లా నాయక్'​ చిత్రానికి త్వరలోనే సీక్వెల్​ రూపొందనుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈ సినిమాలో డానియేల్ శేఖర్​గా అదరగొట్టిన రానా దగ్గుబాటి స్పందించారు.

Bheemla Nayak
rana daggubati
author img

By

Published : Mar 4, 2022, 2:59 PM IST

Updated : Mar 4, 2022, 3:20 PM IST

Bheemla Nayak: పవర్​స్టార్ పవన్​కల్యాణ్​-రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో వచ్చిన 'భీమ్లానాయక్'​ థియేటర్లలో దుమ్మురేపుతోంది. ఆసక్తికర కథాంశం, రానా-పవన్​ల నటన, తమన్​ నేపథ్య సంగీతం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. బ్లాక్​బస్టర్​ టాక్​తో దూసుకుపోతున్న ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్​ రానుందనే ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై రానా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

"'భీమ్లానాయక్​'కు సీక్వెల్​ ఉంటుందని నేనైతే అనుకోను. కథ ఎక్కడ ముగియాలో అక్కడే ముగిసింది." అని రానా తెలిపారు.

'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ పోలీస్ అధికారిగా నటించారు. రానా కీలకపాత్ర పోషించారు. నిత్యామేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. స్క్రీన్​ప్లే-మాటలు త్రివిక్రమ్ అందించగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

Bheemla Nayak Collection: ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. వారాంతానికి మాత్రం వసూళ్లు భారీగా పడిపోయాయి. తొలి రోజు రూ.26.42 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. ఏడో రోజు రూ.98 లక్షల వసూలు చేసింది. ఓవరాల్​గా రూ.106.9కోట్ల గ్రాస్ రాబట్టింది.

Bheemla Nayak hindi trailer

మరోవైపు​ తెలుగులో సూపర్​ హిట్​ అయిన భీమ్లా నాయక్​ను హిందీలో కూడా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. దీని కోసమే ఈ సినిమా హిందీ ట్రైలర్​ను కూడా శుక్రవారం విడుదల చేశారు. సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి మంది. మరి బాలీవుడ్​లో ఈ సినిమా ఏ స్థాయిలో హిట్టవుతుందో చూడాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: మరో రీమేక్​లో పవన్​​.. కీలక పాత్రలో సాయితేజ్​!

Last Updated : Mar 4, 2022, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.