సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'భారత్'. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. 2014లో వచ్చిన కొరియన్ మూవీ 'ఓడ్ టు మై ఫాదర్'కు రీమేక్‌గా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచింది.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించింది చిత్రబృందం. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సల్మాన్, కత్రినా, దర్శకుడు అలీ సమాధానమిచ్చారు. ఓ అభిమాని ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటించని విషయం గురించి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే సల్మాన్ అతని మాటలకు అడ్డు తగులుతూ ‘ప్రియాంక ఎక్కువ సమయం ఇవ్వలేదు అందుకే చాలా ఇబ్బంది పడ్డాం’ అని సమాధానమిచ్చాడు.
మరో అభిమాని కత్రినాను ప్రశ్నిస్తూ మీ పాత్రకు తగ్గట్టుగా మారేందుకు ఎంత సమయం తీసుకున్నారని అడగ్గా.. ‘రెండు నెలల పాటు కష్టపడ్డాను అని సమాధానమిచ్చింది. 1975 నుంచి 1990 వరకూ ఆ తర్వాత 2010లో అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా పాత్రలో మార్పులుంటాయని.. సినిమాలో వృద్ధురాలి పాత్రలో నటించడం ఇబ్బందిగా అనిపించిందని చెప్పింది కత్రినా. రంజాన్ కానుకగా ప్రేక్షకులు ముందుకు రాబోతోందీ సినిమా.
ఇవీ చూడండి.. సఫారీ గడ్డపై టాలీవుడ్ తారల క్రికెట్ టూర్!