సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన సినిమా 'భజరంగీ భాయ్‌జాన్'. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు కథను సమకూర్చింది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. జులై 17, 2015న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ జపాన్ థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఇదే విషయాన్ని చిత్ర దర్శకనిర్మాత కబీర్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
"మా హృదయాల నుంచి వచ్చిన 'భజరంగీ భాయ్‌జాన్'పై మీరు చూపిన అపుర్వమైన ప్రేమ మాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమే. మీ అందరికీ ధన్యవాదాలు. సినిమా విడుదలై ఐదు సంవత్సరాలు పూర్తైంది. అయినా ఇప్పటికీ జపాన్‌లోని కొన్ని థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది."
-కబీర్ ఖాన్, దర్శకుడు
ఈ సినిమాలో కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్దిఖీ, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు. సల్మాన్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను అలరించి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనమైన వసూళ్లు సాధించింది.
- View this post on Instagram
5 years later it’s still running in some theatres in Japan 😊🙏🏼 #5YearsOfBajrangiBhaijaan
">