ETV Bharat / sitara

కన్నీళ్లు పెట్టుకున్న బాలీవుడ్​ నటి.. ఎందుకంటే? - బాలీవుడ్​ నటి భాగ్యశ్రీ

Bollywood Actres Bhagyasree: తన ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదంటూ పెళ్లి నాటి విషయాల్ని గుర్తుచేసుకున్నారు బాలీవుడ్ నటి భాగ్యశ్రీ. స్మార్ట్​ జోడి అనే రియాలిటీ షోలో పాల్గొన్న ఆమె.. గతాన్ని తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

Bhagyasree himalay pair
భాగ్యశ్రీ-హిమాలయ్ జంట
author img

By

Published : Mar 1, 2022, 5:00 PM IST

Bollywood Actres Bhagyasree: బాలీవుడ్​ నటి భాగ్యశ్రీ తన ప్రేమ, పెళ్లి విషయంలో జరిగిన ఆసక్తికర సంఘటనలను గుర్తుచేసుకున్నారు. స్మార్ట్​ జోడి అనే టీవీ షోలో పాల్గొన్న ఆమె.. గతాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తొలి చిత్రం 'మైనే ప్యార్ కియా'తోనే స్టార్​గా ఎదిగిన భాగ్యశ్రీ.. తన ప్రియుడు హిమాలయ్​ దాసనితో పెళ్లి తర్వాత నటనకు దూరమయ్యారు. 1990లో పెళ్లి చేసుకున్న ఈ జంట తమ జీవిత విశేషాలను షేర్ చేసుకున్నారు. తమ పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయని ఆనాటి విషయాల్ని గుర్తుచేసుకున్నారు.

" నా పెళ్లిలో మా కుటుంబసభ్యులు ఎవరూ లేరు. నేను అతడ్ని పెళ్లి చేసుకుంటానని మా తల్లిదండ్రులకు చెప్పాను. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు తమ పిల్లలపై కలలు కన్నపుడు ఏది మంచిదో నిర్ణయించుకునే అవకాశం కూడా వారికే ఇవ్వాలి".

-భాగ్యశ్రీ, బాలీవుడ్​ నటి

స్మార్ట్ జోడి అనే ఈ రియాలిటీ షోను మనీష్​ పాల్​ నిర్వహిస్తున్నాడు. ఈ షోలో నిజ జీవితంలోని సెలబ్రిటీ జంటల అనుభవాలు, వారి మధ్య వివిధ రకాల పోటీలు పెడతారు. ఇందులో వీరేకాకుండా మాజీ బిగ్​బాస్​ కంటెస్టెంట్​ రాహుల్​ మహాజన్​ అతడి భార్య నటల్య ఇలియానా, విక్రాంత్​-మెనాలిసా జంట, నైల్​ భట్​-ఐశ్వర్యా శర్మ, అర్జున్​ బిజ్లని-నేహా స్వామి, అంకిత లోఖండే- విక్కీ జైన్​ జంటలు పాల్గొంటున్నాయి.

ఇదీ చదవండి: 'కచ్చా బాదమ్'​ సింగర్​కు రోడ్డు ప్రమాదం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.