ETV Bharat / sitara

'బాలీవుడ్​ చిత్రాలన్నీ కాపీ కథలే.. టాలీవుడ్​ గ్రేట్​' - భాగ్యశ్రీ

Bhagya Sree: బాలీవుడ్​ ఫిల్మ్​ ఇండస్ట్రీపై తీవ్ర విమర్శలు చేసింది సీనియర్​ నటి భాగ్యశ్రీ. తెలుగు చిత్రాలను కాపీ కొడుతున్నారని ఆరోపించింది. చాలా కాలం తర్వాత 'రాధేశ్యామ్'​ చిత్రంలో నటించిన ఆమె.. చిత్ర ప్రచారం కోసం హైదరాబాద్​కు వచ్చింది.

bhagya sree
బాలీవుడ్ నటి భాగ్యశ్రీ
author img

By

Published : Mar 3, 2022, 7:20 PM IST

Updated : Mar 3, 2022, 7:30 PM IST

Bhagya Sree: బాలీవుడ్​పై ప్రముఖ సీనియర్ నటి భాగ్యశ్రీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ​అక్కడ వచ్చే చిత్రాలన్నీ కాపీ కథలేనని విమర్శించారు. తెలుగు, మలయాళం నుంచి వచ్చే కథలను కాపీ కొట్టి బాలీవుడ్​లో సినిమాలు తీస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో తెలుగు సినీ పరిశ్రమ గర్వపడే కథలను అందిస్తుందన్నారు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా 'రాధేశ్యామ్​'తో ప్రేక్షకుల ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

రోజురోజుకు తెలుగు సినిమా స్థాయి పెరుగుతోందని భాగ్యశ్రీ అభిప్రాయపడ్డారు. 'రాధేశ్యామ్' చిత్రంలో ప్రభాస్ తల్లిగా నటించడం గొప్ప అనుభూతిని కలిగించిందన్నారు. ఇన్నాళ్లు కుటుంబం, పిల్లల కోసం సినిమాలకు దూరంగా ఉన్నానని.. పిల్లలు ఎదగడం వల్ల తనకు స్వేచ్ఛ లభించిందన్నారు. ఇక వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు భాగ్యశ్రీ వెల్లడించారు. మార్చి 11న 'రాధేశ్యామ్' విడుదలవుతున్న సందర్భంగా ప్రచార నిమిత్తం ఆమె హైదరాబాద్ వచ్చారు. ఈ చిత్రం​తో పాటు ప్రభాస్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ఇదీ చదవండి: 'బాహుబలి నా లైఫ్​లో ఓ మ్యాజిక్​.. లోపాలున్నా సాహోను ఆదరించారు'

Last Updated : Mar 3, 2022, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.