ETV Bharat / sitara

ప్రముఖ సీనియర్​ నటుడు కన్నుమూత - actor died

Abhishek Chatterjee: ప్రముఖ సీనియర్​ నటుడు అభిషేక్​ ఛటర్జీ గుండెపోటుతో గురువారం మరణించారు. ఆయన అనేక బెంగాలీ చిత్రాల్లో నటించారు. ఛటర్జీ మరణంపై బంగాల్​ సీఎం మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.

Bengali actor
Abhishek Chatterjee news
author img

By

Published : Mar 24, 2022, 12:57 PM IST

Bengali actor Abhishek Chatterjee: ప్రముఖ బెంగాలీ నటుడు అభిషేక్​ ఛటర్జీ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన తన నివాసంలోనే గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అభిషేక్​ ఛటర్జీ మృతిపై బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు."అభిషేక్​ ఛటర్జీ మరణ వార్త బాధించింది. ఎంతో ప్రతిభ కలిగిన నటుడిని కోల్పోయాం. ఇది సినీ పరిశ్రమకు తీరని లోటు" అని మమత ట్వీట్​ చేశారు.

58 ఏళ్ల అభిషేక్ ఛటర్జీ.. బుధవారం ఓ చిత్ర షూటింగ్ సమయంలో కడుపునొప్పితో బాధపడ్డారు. దీంతో ఆయన నివాసానికి తరలించి చికిత్స అందించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అభిషేక్​.. 1986లో తరుణ్​ మజుందార్​ తీసిన 'పాత్​భోలా'చిత్రంతో అరంగేట్రం చేశారు. 'దహన్​','బరివాలి', 'అలో' వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

ఇదీ చదవండి: RRR: 300రోజులు.. 3వేలమంది.. రూ.500కోట్ల బడ్జెట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.