యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్.. బాలీవుడ్ ఎంట్రీకి ఆటంకాలు తప్పట్లేదు! తెలుగు బ్లాక్‌బస్టర్ 'ఛత్రపతి' రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్ 22న మొదలైంది. ఆ తర్వాత కరోనా కేసులు పెరగడం వల్ల చిత్రీకరణను నిలిపేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో పడిన అకాల వర్షం.. ఈ చిత్రం కోసం రూపొందించిన రూ.3 కోట్ల విలువైన సెట్‌ను నాశనం చేసిందట.
విలేజ్ లుక్ కనిపించేలా ఈ సెట్‌ను దాదాపు 6 ఎకరాల్లో నిర్మించారు. ఇప్పుడు వర్షానికి పాడవటం వల్ల దీనిని త్వరగా బాగుచేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇది చదవండి: ప్రభాస్‌కు ఏమాత్రం తగ్గకుండా కష్టపడతా: బెల్లంకొండ