దేశ సరిహద్దుల్లో భారత జవాన్‌గా ఉండటం అంత సులభం కాదని అంటున్నారు కథానాయకుడు రానా. తాను నటించిన 'మిషన్ ఫ్రంట్‌లైన్' డాక్యుమెంటరీ జవాన్లకు అంకితం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ డాక్యుమెంటరీలో పనిచేయడం వల్ల మన సరిహద్దుల్లో కాపలాకాసే జవాన్ల గురించి ఒక దృక్పథం ఏర్పడిందని రానా చెప్పారు. ఈ డాక్యుమెంటరీలో జవాన్ల జీవన విధానాన్ని ప్రధానంగా చూపించబోతున్నామని తెలియజేశారు. జనవరి 21 నుంచి 'డిస్కవరీప్లస్‌ఇన్'లో 'మిషన్ ఫ్రంట్‌లైన్' ప్రసారం కానుందని తెలిపారు.
ఇప్పటికే విడుదలైన ఈ ప్రోమో అందరినీ అలరిస్తోంది. డాక్యుమెంటరీలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డిస్నీప్లస్.. భారత జవాన్ల జీవన శైలిని ప్రేక్షకుల కళ్ల ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతో ఈ డాక్యుమెంటరీని తీర్చిదిద్దింది. కాగా.. ఈ డాక్యుమెంటరీ తెరకెక్కించేందుకు నేరుగా బీఎస్‌ఎఫ్ (బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్) సహాకారం తీసుకుంది. వాళ్ల సహాయంతోనే పలు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని చిత్రీకరణ పూర్తి చేసింది. రానా జవాన్‌గా కనిపించనున్నారు. కాగా.. అక్కడ జవాన్లతో కలిసి ఉన్న తన అనుభవాలను రానా పంచుకున్నారు.
-
Being in the @BSF_India is not easy! Drills, firing, simulated mission, I could feel the rush and a sense of pride! Going through grueling physical training with these heroes was a priceless feeling. #MissionFrontline Premieres 21st Jan on @discoveryplusIN #DiscoveryPlusOriginal pic.twitter.com/9U3O2iglyJ
— Rana Daggubati (@RanaDaggubati) January 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Being in the @BSF_India is not easy! Drills, firing, simulated mission, I could feel the rush and a sense of pride! Going through grueling physical training with these heroes was a priceless feeling. #MissionFrontline Premieres 21st Jan on @discoveryplusIN #DiscoveryPlusOriginal pic.twitter.com/9U3O2iglyJ
— Rana Daggubati (@RanaDaggubati) January 18, 2021Being in the @BSF_India is not easy! Drills, firing, simulated mission, I could feel the rush and a sense of pride! Going through grueling physical training with these heroes was a priceless feeling. #MissionFrontline Premieres 21st Jan on @discoveryplusIN #DiscoveryPlusOriginal pic.twitter.com/9U3O2iglyJ
— Rana Daggubati (@RanaDaggubati) January 18, 2021
"భారతదేశ సరిహద్దు భద్రతా దళంలో ఉండటం అంత సులభం కాదు. వాళ్లకు సెలవులు, విరామాలుండవు. సరిగ్గా ఊపిరి తీసుకునేందుకు వీలు కూడా ఉండదు. వాళ్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తారు. లేకపోతే మన దేశమే ప్రమాదంలో పడిపోతుంది. విధుల్లో భాగంగా ప్రతిరోజూ కసరత్తులు, కాల్పులు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఆ హీరోల సాయంతో కఠిన శిక్షణ పొందాను. వాళ్లతో ప్రయాణం ఎంతో అమూల్యమైన అనుభూతినిచ్చింది. ఆ సమయంలో భారతదేశ గొప్పతనాన్ని ఆస్వాదించాను."
- రానా దగ్గుబాటి, కథానాయకుడు
ప్రస్తుతం రానా వరుస సినిమాలతో తీరికలేకుండా ఉన్నారు. 'అరణ్య'లో వినూత్నమైన పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్‌లో రానా నటించనున్నారు. వీటితో పాటు 'విరాట పర్వం', '1945', 'హిరణ్యకశ్యప' సినిమాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి.
ఇదీ చూడండి: షూటింగ్‌ల్లో ఇప్పటికీ టెన్షన్ పడతా: సమంత