మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్- యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్‌ఆర్'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 13న 'ఆర్‌ఆర్‌ఆర్'ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో ప్రతిష్ఠాత్మక సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు తీపి కబురు చెప్పినట్లైంది.
![behind the reason RRR movie release on october 13](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10377376_1.jpg)
ఆ రోజే ఎందుకంటే..!
'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఇప్పటి వరకూ రెండుసార్లు సినిమా విడుదల వాయిదా పడింది. తొలుత ప్రకటించిన తేదీ ప్రకారం గతేడాది జులై 30న సినిమా విడుదల కావాల్సిఉంది. అయితే, ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కరోనా కారణంగా 'ఆర్‌ఆర్‌ఆర్'తో సహా అన్ని సినిమాల షూటింగ్‌లు, విడుదల తేదీలు తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలో 'ఆర్‌ఆర్‌ఆర్'ను సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారా? అన్న ఆసక్తి అందరిలోనూ కలిగింది. ఈ చిత్రంలో నటిస్తున్న ఐరిష్ నటి అలీసన్ డూడీ అక్టోబరు 8న 'ఆర్‌ఆర్‌ఆర్' అంటూ పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్ చేసింది. దీంతో సినిమా విడుదల తేదీ దాదాపు ఖరారు అనుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో చిత్ర బృందం సినిమాను అక్టోబరు 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
![behind the reason RRR movie release on october 13](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10377376_3.jpg)
'బాహుబలి' తర్వాత రాజమౌళి సినిమాలకు అంతర్జాతీయ క్రేజ్ ఏర్పడింది. చైనా, జపాన్ సహా పలు దేశాల్లో ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో సరైన సమయంలో సినిమాను విడుదల చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అలీసన్ డూడీ చెప్పినట్లు అక్టోబరు 8న సినిమా విడుదల చేస్తే 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్ర బాండ్ 'నో టైమ్ టు డై'తో పోటీ పడాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా బాండ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా విడుదల తేదీని మరో నాలుగు రోజులు పొడిగించారు. దీంతో థియేటర్ల విషయంలో రెండు సినిమాలకు వెసులుబాటు లభించినట్లవుతుంది. 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి భారీ ప్రాజెక్టు విడుదల తేదీ ముందుగా ప్రకటించడం కూడా ఒక విధంగా మంచిదే. దసరా సమయానికి మరో చిత్రం పోటీ పడకుండా కాస్త అటూ ఇటూ తేదీలు మార్చుకునే వెసులుబాటు కలుగుతుంది. మిగిలిన సినిమా మేకర్స్ కూడా అందుకు అనుగుణంగా షెడ్యూల్స్ మార్చుకుంటారు. అంతేకాదు, అప్పటికి కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు పూర్తిస్థాయిలో థియేటర్‌కు వచ్చేందుకు అవకాశం లభిస్తుంది.
![behind the reason RRR movie release on october 13](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10377376_8.jpg)
భారీ అంచనాలు..
జక్కన్న తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్'పై ఇప్పటికైతే భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్-రామ్‌చరణ్ కథానాయకులు కావడం వల్ల సినిమాకు సంబంధించి వచ్చే ప్రతి అప్‌డేట్ కోసం అటు నందమూరి, ఇటు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు విడుదల తేదీ ప్రకటించడం వల్ల వారి ఆనందం కాస్త రెట్టింపు అయింది.
![behind the reason RRR movie release on october 13](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10377376_5.jpg)
![behind the reason RRR movie release on october 13](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10377376_4.jpg)
మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ మార్కెట్ హక్కులు ఇప్పటికే భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈ ఏడాదే సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇటీవలే క్లైమాక్స్ చిత్రీకరణ కూడా ప్రారంభమైంది. దీంతో సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లే. చారిత్రక నేపథ్యం ఉన్న కథ కావడం వల్ల వీఎఫ్‌ఎక్స్ పనులకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవైపు ఈ పనులు పూర్తి చేస్తూనే, మరోవైపు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నారు.
![behind the reason RRR movie release on october 13](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10377376_7.jpg)
![behind the reason RRR movie release on october 13](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10377376_6.jpg)
![behind the reason RRR movie release on october 13](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10377376_10.jpg)
![behind the reason RRR movie release on october 13](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10377376_9.jpg)
![behind the reason RRR movie release on october 13](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10377376_11.jpg)
![behind the reason RRR movie release on october 13](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10377376_13.jpg)
![behind the reason RRR movie release on october 13](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10377376_12.jpg)
ఇదీ చూడండి: బన్నీ, మహేశ్ సినిమాల్లో ఐటెంగర్ల్‌గా ఊర్వశి!