'మా' ఎన్నికల్లో(MAA Elections 2021) ప్రధాన కార్యదర్శి పదవికి బండ్ల గణేశ్(Bandla Ganesh News) నామినేషన్ వేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు బండ్ల గణేశ్. ప్రధాన కార్యదర్శిగా గెలిపిస్తే.. 100 మంది పేద కళాకారులకు రెండు పడక గదుల ఇళ్లు కట్టిస్తానన్నారు.
'మా' ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్నా. ప్రధాన కార్యదర్శిగా గెలిస్తే.. 100 మంది పేద కళాకారులకు రెండు పడక గదుల ఇళ్లు కట్టిస్తా. నన్ను గెలిపిస్తే 'మా' కోసం బిల్డింగ్ కట్టను. హైదరాబాద్‌లో హీరోలతో గంట సేపు ప్రోగ్రామ్ పెట్టిస్తా. హీరోల ప్రోగ్రామ్‌తో రూ.25 కోట్లు సేకరిస్తాను"
-- బండ్ల గణేశ్, సినీ నిర్మాత
విందులు, సమావేశాలతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని బండ్ల గణేశ్(Bandla Ganesh News) ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తనకు పరమేశ్వరుడి మద్దతుందని తెలిపారు.
అధ్యక్ష అభ్యర్థిగా సీవీఎల్ నామినేషన్
మా ఎన్నికల్లో(MAA Elections 2021) అధ్యక్ష అభ్యర్థిగా నటుడు సీవీఎల్ నర్సింహారావు నామినేషన్ దాఖలు చేశారు. 'మా' కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీవీఎస్, ప్రకాశ్‌రాజ్ కొద్దిసేపు మాట్లాడుకున్నారు.
ఇదీ చదవండి: MAA Elections 2021: 'మా' అధ్యక్ష పదవికి ప్రకాశ్‌రాజ్ నామినేషన్