మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ప్రచార వేడి పెరిగింది. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో(Maa Elections 2021) అధ్యక్ష పీఠం కోసం ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉండటం వల్ల అందరి చూపు సిని'మా'పరిశ్రమపైనే ఉంది. మరోవైపు, జనరల్ సెక్రటరీ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగుతున్న బండ్ల గణేశ్ వినూత్న ప్రచారానికి తెర తీశారు. ట్విటర్ వేదికగా ఓ పోస్టర్ షేర్ చేసిన ఆయన 'ఒకే ఒక్క ఓటు. మా కోసం. మన కోసం. మనందరి కోసం. మా తరఫున ప్రశ్నించడం కోసం' అని పేర్కొన్నారు.
-
@HeroManoj1 @themohanbabu @LakshmiManchu @LakshmiManchu @iVishnuManchu @prakashraaj @actorsrikanth pic.twitter.com/ThMytlgSKZ
— BANDLA GANESH. (@ganeshbandla) September 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">@HeroManoj1 @themohanbabu @LakshmiManchu @LakshmiManchu @iVishnuManchu @prakashraaj @actorsrikanth pic.twitter.com/ThMytlgSKZ
— BANDLA GANESH. (@ganeshbandla) September 24, 2021@HeroManoj1 @themohanbabu @LakshmiManchu @LakshmiManchu @iVishnuManchu @prakashraaj @actorsrikanth pic.twitter.com/ThMytlgSKZ
— BANDLA GANESH. (@ganeshbandla) September 24, 2021
'ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీతోపాటు మిగిలిన ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా మీకు ఇష్టమైన వాళ్లను ఎన్నుకోండి. కానీ, జనరల్ సెక్రటరీగా నన్ను గెలిపించండి'అని అభ్యర్థించారు. ఇండస్ట్రీలో ఉన్న అగ్ర, యువ నటీనటులను ట్యాగ్ చేస్తూ ఆయన ఈ ట్వీట్ పెట్టారు.
ప్రకాశ్‌రాజ్ ఏర్పాటు చేసిన 'సినిమా బిడ్డలం' ప్యానల్‌లో బండ్ల గణేశ్ సభ్యుడిగా కొన్నాళ్లపాటు ఉన్నారు. అయితే, ప్రకాశ్‌రాజ్ తన టీమ్‌లోకి జీవితా రాజశేఖర్‌ను తీసుకోవడాన్ని వ్యతిరేకించి.. ఆ టీమ్ నుంచి బయటకు వచ్చేశారు. జీవితపై పోటీ చేయాలనే ఉద్దేశంతో జనరల్ సెక్రటరీ పదవి కోసం తాను బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: Maa elections: జీవితపై నటుడు పృథ్వీరాజ్ ఫిర్యాదు