నందమూరి నటసింహం బాలకృష్ణ కొత్త అప్డేట్తో దసరా పండుగకు వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు. ఈ రోజు సాయంత్రం 3గంటల 55 నిముషాలకు సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్‌డేట్ ఇవ్వనుంది చిత్రబృందం.
ఈ పండుగ సందర్భంగా టైటిల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటకే 'రూలర్', 'క్రాంతి' అనే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకుడు. ఇందులో సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలు. ప్రకాశ్‌రాజ్, భూమిక, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. 'జైసింహా' తర్వాత బాలకృష్ణ, నిర్మాత సీ.కల్యాణ్, కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది.
![balayya 105 movie dussara update](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4673228_balayya_105.jpg)
ఈ సినిమాలో బాలయ్య డాన్ పాత్రలో కనిపించనున్నాడట. ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా గ్యాంగ్‌స్టర్‌గా మారాడనేది కథాంశం. ఇటీవల బ్యాంకాక్‌లో సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమా కోసం భారీగానే బరువు తగ్గాడు బాలకృష్ణ.