ETV Bharat / sitara

'అన్​స్టాపబుల్'​ ప్రోమో.. మాటల్లో ఫిల్టర్​ ఉండదు, సరదాలో స్టాప్​ ఉండదు - అన్​స్టాపబుల్​

హీరో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే' ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. నవంబరు 4న ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్​ ఆహా వేదికగా ప్రసారం కానుంది.

balakrishna
బాలకృష్ణ
author img

By

Published : Oct 27, 2021, 5:22 PM IST

హీరో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే' ప్రోమో విడుదలైంది. స్టైలిష్​ లుక్​లో యాక్షన్​ డైలాగ్​లు చెబుతూ బాలయ్య అదరగొట్టారు. స్పోర్ట్స్​ కారు, స్పోర్ట్స్​ బైక్​ నడపడం సహా గుర్రపు స్వారి చేస్తూ బాలయ్య కనిపించడం ప్రోమో మొత్తానికే హైలెట్​గా నిలిచింది. "నీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు, నీకు లక్ష్య శుద్ధి ఉన్నప్పుడు, నీకు సంకల్ప శుద్ధి ఉన్నప్పుడు నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు. మాటల్లో ఫిల్టర్​ ఉండదు, సరదాలో స్టాప్​ ఉండదు.. సై అంటే సై.. నై అంటే నై.. వన్స్​ ఐ స్టెప్​ ఇన్​" అంటూ బాలయ్య చెప్పే డైలాగ్​ అభిమానులను ఆక్టటుకునేలా ఉంది. నవంబరు 4న ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్​ ఆహా వేదికగా ప్రసారం కానుంది.

ఇక ఈ షోకు తొలి సెలబ్రిటీగా మోహన్​బాబు రానున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. సెట్​లో బాలయ్య, మోహన్​బాబు కలిసి దిగిన ఫొటో కూడా వైరల్​ అయింది. కాగా, మెగా ఫ్యామిలీనుంచి నాగబాబు రానున్నారని సమాచారం.

ఇదీ చూడండి: బాలకృష్ణ టాక్​షోలో మోహన్‌బాబు,నాగబాబు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.