టాలీవుడ్ హిట్ కాంబో అంటే ఈతరంలో ముందుగా గుర్తొచ్చేది బాలకృష్ణ-బోయపాటి శ్రీను. ఇప్పటికే 'సింహా', 'లెజెండ్'లతో ఘనవిజయాలు సాధించారు. హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు. దర్శకుడు కథకు మెరుగులు దిద్దుతుండగా, హీరో బాలకృష్ణ.. తన లుక్ మార్చి స్మార్ట్‌గా తయారవుతున్నాడు. రోజుకు 5 గంటలకు పైగా జిమ్‌లో చెమటోడ్చుతూ, ఇందులోని ఓ పాత్ర కోసం దాదాపు 25 కిలోల బరువు తగ్గనున్నాడు.
ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు బాలకృష్ణ. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: సెప్టెంబరు: బడా సినిమాలకు దూరం.. డిజాస్టర్లకు చేరువ!