బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ప్రస్తుతం ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని ఒక పాత్రపై టాలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. అదేంటంటే? హీరో స్నేహితుడి పాత్ర. తన కామెడీతో నవ్వుల పువ్వులు పూయించే సునీల్.. బాలయ్యకు స్నేహితుడిగా ఈ మూవీలో నటించనున్నాడని సమాచారం. ఇది కీలకమైన పాత్రని.. కామెడీ ఎక్కువ ప్రదర్శించే అవకాశం ఉండటం వల్ల సునీల్‌ని ఎంపిక చేయనున్నారని టాక్.
ఇప్పటివరకు ఎక్కువగా యాక్షన్ మీద దృష్టిపెట్టిన బోయపాటి.. ఈసారి కామెడీ ట్రాక్‌ను నడిపించబోతున్నాడని సమాచారం. బాలయ్య మిత్రుడిగా సునీల్ ఎలా మెప్పిస్తాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రంలో బాలయ్య సరసన నటించేందుకు కథానాయికను అన్వేషించే పనిలో ఉంది చిత్రబృందం. ఫిబ్రవరి 15 నుంచి చిత్రీకరణ ప్రారంభంకానుంది.
ఇదీ చూడండి.. చిన్నారుల ఆవేదన విని సూర్య కన్నీళ్లు