ETV Bharat / sitara

ఆ పాత్రలో బాలయ్యకు పోటీగా మనోజ్​! - బాలకృష్ణ కొత్త సినిమాలు

ఒకే చిత్రంలో ఇద్దరు కథానాయకులు నటిస్తే ఎలా ఉంటుందో.. ఒకే పాత్రలో ఇద్దరు నటులు కనిపిస్తే అంతకన్నా ఆసక్తి ఉంటుంది. అగ్రహీరో బాలకృష్ణ, మంచు మనోజ్‌ విషయంలో ఇదే జరగనుంది. గతంలో ఒకే తెరను పంచుకున్న వీరిద్దరూ తాజాగా ఒకే పాత్రను పోషించనున్నారు. అది కూడా ఇరువురి కెరీర్​లోనూ మొదటిసారిగా ఓ వినూత్న గెటప్​లో. మరి ఈ ఇద్దరిలో ఎవరు బాగా మెప్పించగలరో తెలుసుకోవాలంటే కాస్త వేచి ఉండక తప్పదు.

balakrishna manchu manoj are seen in agora getups in there next films
అదే పాత్రలో బాలయ్యకు పోటీగా మనోజ్​!
author img

By

Published : Feb 17, 2020, 6:41 AM IST

Updated : Mar 1, 2020, 2:12 PM IST

నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్​ ఇద్దరూ గతంలో 'ఊ.. కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రంలో కలిసి నటించారు. ఒకే తెరను పంచుకున్న వీరిద్దరు ఈ ఏడాది ఒకే పాత్రలో నటించేందుకు పోటీ పడనున్నారు. అదీ అఘోరా వేషంలో. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అతడు రెండు గెటప్పుల్లో దర్శనమివ్వనున్నాడు. వాటిలో ఒకటి అఘోరా పాత్ర. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఆ లుక్‌లో బాలయ్య ఎలా ఉంటాడా.. అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇలాంటి కీలక పాత్రలు పోషించాలంటే కొంచెం సాహసంతో కూడిన వ్యవహారమే. అందుకే ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సరికొత్త పాత్రలు పోషించేందుకు యువ హీరోలూ సిద్ధమవుతున్నారు. వినూత్న కథల్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ముందుండే మనోజ్‌ ఈ ప్రయత్నం చేస్తున్నాడని గుసగుసలు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మనోజ్‌ 'అహం బ్రహ్మాస్మి' చిత్రంతో వస్తున్నాడు. ఈ సినిమాలో ఈ హీరో అఘోరాగా కనిపిస్తాడని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. బాలయ్య, మనోజ్‌.. ఇద్దరూ కెరీర్‌లో తొలిసారి అఘోరా పాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం బాలయ్య చిత్రం షూటింగ్​ జరుపుకొంటోంది. మనోజ్‌ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. రెండు చిత్రాలు రోజుల వ్యవధిలోనే విడుదలవుతాయని, ఒకే పాత్రతో ఇద్దరు నాయకులు బాక్సాఫీస్ ఎదుట సందడి చేస్తారని తెలుస్తోంది. మరి అఘోరాగా ఎవరు ప్రేక్షకుల్ని మెప్పిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇదీ చదవండి: దేవరకొండ సెంటిమెంట్ బ్రేక్ అయిందిగా​..!

Last Updated : Mar 1, 2020, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.