మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల(MAA Elections) గురించి నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మా' ఎన్నికల గురించి మాట్లాడారు. ఇంతకాలం అసోసియేషన్‌కు సొంత భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు.
"మా'కు శాశ్వత భవనాన్ని ఇంతకాలం ఎందుకు నిర్మించలేకపోయారు? ఇప్పటివరకు సేకరించిన విరాళాలను ఏం చేశారో చెప్పాలి. నటీనటులందరూ కలిసి ముందుకు వస్తే 'మా' కోసం ఇంద్ర భవనాన్నే నిర్మించొచ్చు. ఒకవేళ అదేచేస్తే భవన నిర్మాణంలో తాను కూడా భాగస్వామిని అవుతాను" అని బాలయ్య అన్నారు.
ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' చిత్రం చేస్తున్నారు. ఇటీవలే ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. దసరా కానుకగా చిత్రం థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.