అగ్ర కథానాయకులు నటిస్తున్న చిత్రాల్లో ఆర్ఆర్ఆర్ మినహా మరేదీ పట్టాలెక్కలేదు. దసరా తర్వాతే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు పలువురు కథానాయకులు. సీనియర్ హీరో బాలకృష్ణ కూడా వచ్చే నెలలోనే కెమెరా ముందుకు వెళ్లబోతున్నారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న సినిమా చిత్రీకరణ కరోనా వల్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే నెలలో తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది చిత్రబృందం.
ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాల కోసం లొకేషన్ల వేట సాగిస్తున్నట్టు తెలిసింది. సింహా, లెజెండ్ తర్వాత బాలకృష్ణ - బోయపాటి కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి ఆ సినిమా కోసం కీర్తి మేకప్ వేసుకోలేదట!