బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా 'బీబీ3'(వర్కింగ్ టైటిల్). ఈ చిత్ర షూటింగ్ కర్ణాటకలోని దండేలి అభయారణ్యంలో జరుగుతోంది. ప్రస్తుతం పతాక సన్నివేశాల కోసం రెడీ అవుతున్నట్లు సమాచారం. బాలయ్య - ప్రగ్యా జైశ్వాల్ ఇతర నటులపై స్టంట్ మాస్టర్ శివ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు బోయపాటి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారట. ఈ షెడ్యూల్ ఏప్రిల్ 3 నాటికి పూర్తి కానుంది.
ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ-ప్రగ్యా జైశ్వాల్ ఐఏఎస్ అధికారులుగా కనిపించనున్నారు. మరో నటి పూర్ణ వైద్యురాలి పాత్రలో కనిపించనుందట. అయితే ఆమె పాత్రలో కొంత నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాలీవుడ్ టాక్. శ్రీకాంత్ కీలక పాత్ర పోషించనున్నారు. చిత్రానికి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. తమన్ సంగీత స్వరాలు అందిస్తుండగా రామ్ ప్రసాద్ ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ ఏడాది మే 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఇదీ చూడండి: బీబీ3: పవర్ఫుల్ రోల్లో హీరో శ్రీకాంత్!
ఇదీ చూడండి: బాలకృష్ణ.. ఎనర్జీకే పవర్హౌస్: ప్రగ్యా