నందమూరి బాలకృష్ణ.. 'జై సింహ' తర్వాత కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'రూలర్'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా రాణించలేకపోయింది. ఈ ప్రభావం బాలయ్య కొత్త ప్రాజెక్టుపై పడిందని సినీ వర్గాల్లో టాక్.
'రూలర్' ప్రభావం పడినట్లేనా
బాలయ్య 106వ చిత్రానికి మిర్యాల రవీందర్ నిర్మాత. దాదాపు రూ.70 కోట్ల బడ్జెట్ నిర్ణయించినట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే 'రూలర్' ఫలితం చూసిన ఆయన.. అంత బడ్జెట్ పెట్టేందుకు వెనుకాడుతున్నాడట. బాలకృష్ణ-బోయపాటిలకు పారితోషికం ఇవ్వకుండా లాభాల్లో వాటా ఇవ్వాలని నిర్ణయించారట. ఈ విషయమై ఇప్పటికే ఇరువురితో చర్చలు జరిపారట.
బోయపాటికి సలహాలు
బడ్జెట్‌ను పూర్తిగా కుదించేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని బోయపాటికి సలహా ఇచ్చారట రవీందర్. వీటన్నింటికీ సరే అంటేనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని, లేదంటే దీని నుంచి తప్పుకుంటానని తేల్చిచెప్పినట్లు వార్తలొస్తున్నాయి.
మరి ఈ వార్తలో నిజమెంత? అసలు ఈ చిత్రం ఉంటుందా? లేదా? అన్న అనుమానాలపై స్పష్టత రావాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.
ఇదీ చదవండి: రివ్యూ 2019: చెలరేగిన చిన్న సినిమాలు.. మెప్పించిన మల్టీస్టారర్లు