ETV Bharat / sitara

బాలయ్య 'అఖండ' రిలీజ్​ డేట్ ఫిక్స్! - అఖండ మూవీ రిలీజ్ డేట్

బాలయ్య 'అఖండ' కూడా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. డిసెంబరు తొలి వారంలో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.

Balakrishna 'Akhanda' movie
బాలకృష్ణ అఖండ మూవీ
author img

By

Published : Nov 11, 2021, 5:31 AM IST

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్​లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం 'అఖండ'. షూటింగ్​ పూర్తయినప్పటికీ లాక్​డౌన్ వల్ల విడుదల ఆలస్యమైంది. దీంతో ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. సినిమా థియేటర్లలోకి ఎప్పుడొస్తుందా అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే విడుదల తేదీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పాటలు, ప్రచార చిత్రంతో ఫ్యాన్స్​ను అలరిస్తున్న 'అఖండ'.. డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్ ప్రతినాయకుడిగా చేశారు. పూర్ణ కీలకపాత్ర పోషించారు. తమన్ సంగీతమందించారు. బోయపాటి దర్శకత్వం వహించగా, మిర్యాల రవీందర్​రెడ్డి నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.