ETV Bharat / sitara

ఓటీటీలోనూ 'అఖండ' హవా.. రికార్డు వ్యూస్​తో జోరు - అఖండ తాజా రికార్డులు

నందమూరి బాలయ్య 'అఖండ' చిత్రం మరో రికార్డును సొంతం చేసుకుంది. ఓటీటీలో విడుదలై 24 గంటలు పూర్తికాక ముందే 1 మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించి అరుదైన రికార్డును నెలకొల్పింది.

akhanda movie
అఖండ సినిమా
author img

By

Published : Jan 22, 2022, 4:21 PM IST

బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ' చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో మనందరికి తెలిసిందే. కొవిడ్ సెంకడ్​ వేవ్​ తర్వాత థియేటర్లకు పూర్వవైభవాన్ని తెచ్చిన చిత్రంగా నిలిచింది. అఖండ విజయవంతంగా ఇటీవలే 50 రోజులు పూర్తిచేసుకుంది. అయితే.. జనవరి 21న ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఓటీటీలోకి వచ్చి 24గంటలు గడవకముందే.. 1మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించి అరుదైన రికార్డును నెలకొల్పింది.

ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా, తమన్ సంగీతం అందించారు. ప్రగ్యాజైశ్వాల్‌ కథానాయిక. శ్రీకాంత్​, జగపతిబాబు, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

బాలయ్య ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నారు. శ్రుతిహాసన్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరోవైపు 'అన్​స్టాపబుల్ విత్​ ఎన్​బీకే' టాక్​ షోతో ఓటీటీ ప్రేక్షకుల్ని కూడా అలరిస్తున్నారు బాలకృష్ణ.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: సామ్-చైతూ విడాకులు.. ఆ వార్తలు నన్ను బాధించాయి: నాగార్జున

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.