ETV Bharat / sitara

'మహాభారతం' కోసం 'బాహుబలి' రచయితతో ఆమిర్ - mahabharatam latest news

ప్రతిష్ఠాత్మక చిత్రం 'మహాభారతం' గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమాకు సంబంధించి బాలీవుడ్​ హీరో ఆమిర్​ఖాన్​తో కలిసి స్క్రిప్ట్​పై చర్చలు ప్రారంభించినట్లు తెలిపారు.

'Baahubali' scribe in talks to write Aamir Khan's 'Mahabharat'
'మహాభారతం' చిత్రంపై 'బాహుబలి' రచయిత ఆసక్తికర వ్యాఖ్యలు!
author img

By

Published : Jun 14, 2020, 5:30 AM IST

బాలీవుడ్​ హీరో ఆమిర్​ఖాన్​తో కలిసి 'మహాభారతం' సినిమా కథపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్​. త్వరలోనే స్క్రిప్ట్​ పనులు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఆమిర్​​ కొంతకాలంగా 'మహాభారతం' చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

'మహాభారతం' సినిమాకు సంబంధించి నాకు, ఆమిర్​ఖాన్​కు​ మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే స్క్రిప్ట్​ పనులను ప్రారంభిస్తాం. ఈ ప్రాజెక్టుపై ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను.

విజయేంద్ర ప్రసాద్​, సినీ రచయిత

లాక్​డౌన్​ సమయంలో కొన్ని కథలు సిద్ధం చేసినట్లు విజయేంద్ర ప్రసాద్​ తెలిపారు. తనయుడు ఎస్​.ఎస్​. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్​బాస్టర్ మూవీ​ 'బాహుబలి'తో పాటు, 'భజరంగీ భాయిజాన్'​, 'మణికర్ణిక' వంటి ఎన్నో చిత్రాలకు రచయితగా పని చేశారు ప్రసాద్​. ప్రస్తుతం 'ఆర్​ఆర్ఆర్'​పైనే దృష్టి పెట్టానని.. దీని తర్వాతే మరో సినిమా వివరాలు ప్రకటిస్తానని తెలిపారు .

'ఆర్ఆర్ఆర్​'లో హీరో రామ్​చరణ్​, జూనియర్​ ఎన్టీఆర్​ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్​ నటులు అజయ్​ దేవగణ్​,ఆలియా భట్​ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇదీ చూడండి:మహాభారతంపై జక్కన్న క్లారిటీ.. పూర్తి చేస్తానని వెల్లడి

'మహాభారతం' కోసం 'బాహుబలి' రచయితతో ఆమిర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.