టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకపూర్ జంటగా తెరకెక్కుతోన్న హిందీ చిత్రం 'బాఘీ-3'. అహ్మద్ ఖాన్ దర్శకుడు. తాజాగా ఇందులోని 'దస్ బహానే 2.ఓ' పేరుతో మొదటి గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం. ఫాస్ట్‌బీట్‌కు తగ్గట్టుగా ష్రాఫ్, శ్రద్ధా అదరగొట్టే స్టెప్పులేసి అలరించారు. లొకేషన్లు కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. విశాల్, శేఖర్ సంగీత స్వరాలు సమకూర్చగా విశాల్, శేఖర్, కేకే, షాన్, తులసి కుమార్ పాటను అలపించారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పాట అందరిని ఆకట్టుకుంటోంది. సజీద్ నదియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: 'శతురంగ వెట్టై 2' ఆధారంగా రవితేజ కొత్త చిత్రం!