బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా మరో వైవిధ్యమైన పాత్రకు సిద్ధమవుతున్నాయి. తొలిసారి అథ్లెట్ పాత్రలో కనువిందు చేయనున్నాడట. ఇందులో ఆటగాడి శారీరక మార్పుల గురించి ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అభిషేక్ కపూర్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికీ టైటిల్ ఖరారవని ఈ సినిమా.. అక్టోబర్‌లో పట్టాలెక్కనుంది.
"ఆయుష్మాన్, నాకు కొన్ని విభిన్న చిత్రాలంటే ఇష్టం. ఇది ఇద్దరికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ చిత్రాన్ని అభిమానులు థియేటర్లకు వచ్చి చూస్తారని ఆశిస్తున్నాం. అందుకోసం మేం ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉన్నాం. మంచి ఫలితం వచ్చే దిశగా మా ప్రయత్నాలు చేస్తాం" అని అభిషేక్ తెలిపాడు.
అభిషేక్ గతంలో 'కై పో చే', 'ఫితుర్', 'రాక్ ఆన్' వంటి చిత్రాలు తెరకెక్కించాడు. ఈ కొత్త సినిమా వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
లాక్‌డౌన్‌కు ముందు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఆయుష్మాన్ ఖురానా 'గులాబో సితాబో' చిత్రంలో నటించాడు. ఈ సినిమా థియేటర్‌లో విడుదల కావాల్సి ఉండగా.. థియేటర్లు తెరవడంపై నిషేధం కొనసాగుతుండడం వల్ల ఓటీటీలో విడుదల చేశారు. సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినా.. అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా నటనకు మంచి మార్కులు పడ్డాయి.