ETV Bharat / sitara

'సొంతూరిలో షూటింగ్.. అయినా ఇంటికి దూరం' - వాణి కపూర్​ కొత్త సినిమా

సొంత ఊరిలోనే షూటింగ్​ అయినా.. ఇంటికి వెళ్లట్లేదు నటుడు ఆయుష్మాన్​ ఖురానా. భార్య బిడ్డలకు దూరంగా ఉంటున్నాడు. తల్లిదండ్రులనూ కలవడం లేదు. చిత్రబృందంతో పాటు హోటల్​లోనే గడుపుతున్నాడు. అందుకు కారణమేంటో తాజాగా వివరించాడు ఖురానా.

Ayushmann reveals why he is not living with family despite shooting in hometown
'అందుకే ఇంటికి వెళ్లకుండా ఉండిపోయాను'
author img

By

Published : Nov 3, 2020, 1:28 PM IST

బాలీవుడ్​ నటుడు ఆయుష్మాన్ ఖురానా.. 'ఛండీఘడ్​ కరే ఆషికీ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్​ తన సొంత రాష్ట్రం ఛండీగఢ్​లోనే జరుగుతోంది. కానీ, అతడు మాత్రం తన ఇంటికి వెళ్లడం లేదు. దానికి కరోనా మహమ్మారే కారణం అని తెలిపాడీ నటుడు. తన కుటుంబానికి వైరస్ సోకకూడదనే ఉద్దేశంతోనే.. హోటల్​లో ఉంటున్నానని చెప్పాడు.

"నా వల్ల నా భార్య, ఇద్దరు పిల్లలకు వైరస్​ సోకకూడదు. ఛండీగడ్​లోనే ఉన్న నా తల్లిదండ్రులు కూడా ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇండస్ట్రీ పునఃప్రారంభంలో నేను భాగమవుతున్నప్పటికీ నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. అందుకోసమే.. నేను చిత్రబృందంతో పాటు హోటల్​లో దిగాను. ఈ షూటింగ్​ ముగిసే వరకు మేమంతా ఇక్కడే ఉంటాం."

-ఆయుష్మాన్​ ఖురానా, నటుడు.

ఎప్పుడైనా తన కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లినప్పుడు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్​ ధరిస్తానని చెప్పాడు ఆయుష్మాన్​. అది కాస్త ఇబ్బందికరమే అయినా.. తప్పదని వెల్లడించాడు. అభిషేక్​ కపూర్​ దర్శకత్వంలో 'ఛండీగడ్​ కరే ఆషికీ' తెరకెక్కుతోంది. వాణీ కపూర్​ హీరోయిన్​గా నటిస్తోంది.

ఇదీ చూడండి:నేచురల్ స్టార్ సినిమాలో రోహిత్ నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.