తనకు విలన్లు అంటే చాలా ఇష్టమని, అలాంటి పాత్రల్లో నటించాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టాడు బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా. ఇందులో భాగంగా హాలీవుడ్ పాత్ర 'జోకర్' వేషధారణలోని ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు. అయితే ఇది ఓ అభిమాని తయారు చేసిందని, తన మనసు అర్థం చేసుకుని రూపొందించిన అతడికి కృతజ్ఞతలు తెలిపాడు. 'జోకర్' లాంటి పాత్రలు చేయాలని ఉందని రాసుకొచ్చాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
బాలీవుడ్లో విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తున్న ఆయుష్మాన్.. విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నాడు. గతేడాది 'ఆర్టికల్ 15', 'డ్రీమ్‌గర్ల్'తో అలరించాడు. ఈ సంవత్సరం 'శుభ్మంగల్ జ్యాదా సావదాన్'తో అభిమానుల్ని పలకరించాడు. అమితాబ్‌తో ఆయుష్మాన్ కలిసి నటించిన 'గులాబో సితాబో' సినిమా త్వరలో విడుదల కానుంది.
ఇవి చదవండి: