Ashish Nehra IPL: ఐపీఎల్ 2022లో అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు టీమ్ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా. ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ విక్రమ్ సోలంకి... డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉండనున్నారు. భారత జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్.. ఫ్రాంఛైజీ మెంటార్‌గా ఎంపికయ్యాడని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
బీసీసీఐ నిబంధనల ప్రకారం ఈ విషయాలను అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ ఇప్పుడే అధికారికంగా ప్రకటించే అవకాశం లేదు. అందుకోసం వారికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) అవసరం. కాగా, ఈ నెలలోనే అహ్మదాబాద్ ఫ్రాంఛైజీకి ఎల్ఓఐ వచ్చే అవకాశం ఉంది.
కిర్‌స్టెన్‌తో కలిసి నెహ్రా.. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. భారత జట్టుకు కిర్‌స్టెన్ కోచ్‌గా ఉన్న సమయంలో నెహ్రా టీమ్ఇండియాకు ఆడాడు. వారిద్దరి మధ్య ఉన్న సత్సంబంధాలు జట్టుకు దోహదం చేస్తాయని ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: IPL 2022: అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి లైన్‌క్లియర్!