కులం మధ్య అడ్డుగోడలు తొలగించాలనేది 'ఆర్టికల్ 15' ఉద్దేశం. ఈ విషయాన్ని ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన బాలీవుడ్ సినిమా 'ఆర్టికల్ 15'. ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడు. చిత్రబృందం విడుదల చేసిన ట్రైలర్ సగటు సినీ ప్రేక్షుకుడ్ని ఆలోచింపజేస్తోంది. 2014 బదాయూ సామూహిక అత్యాచారం ఘటన ఆధారంగా ఈ సినిమాను తీశారు.
రోజూకూలీ చేస్తున్న ముగ్గురు ఆడపిల్లలు.. తమ దినసరి కూలీని మూడు రూపాయలు పెంచమన్నందకు వాళ్లలో ఇద్దర్ని అత్యాచారం చేసి చంపేస్తారు. శవాల్ని చెట్టుకు వేలాడదీస్తారు. మిగిలిన అమ్మాయి కోసం వెతికే పోలీసుగా ఆయుష్మాన్ నటించాడు. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించాడు. జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: యదార్థగాథ ఆయుష్మాన్ 'ఆర్టికల్15'