ETV Bharat / sitara

'టెర్మినేటర్'​ హీరోకు రెండోసారి గుండె ఆపరేషన్

'టెర్మినేటర్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్​నెగ్గర్​కు రెండోసారి గుండె ఆపరేషన్ జరిగింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు.

Arnold Schwarzenegger feeling 'fantastic' after latest heart surgery
ఆర్నాల్డ్ ష్వార్జ్​నెగ్గర్​కు రెండోసారి గుండె ఆపరేషన్
author img

By

Published : Oct 24, 2020, 4:54 PM IST

తన గుండెకు రెండోసారి సర్జరీ జరిగిందని హాలీవుడ్​ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్​నెగ్గర్​ వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని విజయచిహ్నం చూపిస్తున్న ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్ చేశారు.

తనకు కొత్త వాల్వ్ బిగించారని ఆర్నాల్డ్.. ఆ పోస్ట్​లో పేర్కొన్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. 2018లో తొలిసారి ష్వార్జ్ నెగ్గర్​కు గుండె ఆపరేషన్ జరిగింది.

'టెర్మినేటర్' సిరీస్​లో వచ్చిన ఆరో చిత్రం 'టెర్మినేటర్: డార్క్ ఫేట్'లో చివరగా కనిపించారు ఆర్నాల్డ్. గతేడాది అక్టోబరులో ప్రేక్షకులు ముందుకు వచ్చిందీ సినిమా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.