ETV Bharat / sitara

శ్రీ విష్ణు 'అర్జున ఫల్గుణ' ట్రైలర్ .. గోపీచంద్ కొత్త సినిమా

author img

By

Published : Dec 24, 2021, 3:10 PM IST

Arjuna Phalguna movie:arjuna phalguna hero కొత్త సినిమాల కబుర్లు వచ్చేశాయి. అర్జున ఫల్గుణ ట్రైలర్, ​ అజిత్ 'వాలిమై', అప్డేట్లు ఇందులో ఉన్నాయి.

Arjuna Phalguna trailer gopichand new movie
అర్జున ఫల్గుణ ట్రైలర్ గోపీచంద్

Arjuna Phalguna trailer: శ్రీవిష్ణు కథానాయకుడిగా తేజ మర్ని దర్శకత్వం వహించిన చిత్రం 'అర్జున ఫల్గుణ'. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్​ను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేశారు. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అమృతా అయ్యర్‌ కథానాయిక. డిసెంబర్‌ 31న అంటే ఈ ఏడాది రాబోతున్న చివరి తెలుగు సినిమా ఇదే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Gopichand new movie: స్టార్ కథానాయకుడు గోపీచంద్ మరో సినిమా మొదలుపెట్టేశారు. తనతో 'లక్ష్యం', 'లౌక్యం' లాంటి హిట్​ సినిమాలు తీసిన శ్రీవాస్​తో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్​లో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, డైరెక్టర్స్ వివి వినాయక్, బాబీ, నిర్మాత డీవీవీ దానయ్య తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

gopichand new movie
గోపీచంద్ కొత్త సినిమా
gopichand new movie
గోపీచంద్ కొత్త సినిమా

అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్ల వెల్లడించారు. ఇందులో హీరోయిన్​గా నభా నటేశ్​ను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. అలానే రాజశేఖర్​ విలన్​గా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.

valimai telugu: తమిళ స్టార్​ హీరో అజిత్​ నటిస్తున్న కొత్త సినిమా 'వాలిమై'. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. టాలీవుడ్​ యువహీరో కార్తికేయ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. అజిత్‌కు(ajith kumar valimai release date) జోడీ హ్యుమా ఖురేషి నటిస్తుండగా, యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్​ కానుందీ చిత్రం.

ajith valimai
అజిత్ 'వాలిమై'

Ganapath movie: బాలీవుడ్ హీరో టైగర్​ ష్రాఫ్​ నటిస్తున్న 'గణ్​పత్'​ చిత్రం వచ్చే ఏడాది క్రిస్మస్​ కానుకగా రిలీజ్​ చేయనున్నట్లు స్పష్టంచేసింది చిత్రబృందం. వికాస్ బాహల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ కథానాయిక. పూజా ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్​పై ఈ చిత్రం తెరకెక్కనుంది.

Ganapath
కృతి సనన్

ఇదీ చూడండి: Pushpa: వసూళ్లలో తగ్గేదే లే.. యూఎస్​ఏలో 'పుష్ప' రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.