'అర్జున్‌రెడ్డి' దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి సవాలు విసిరాడు. లాక్‌డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఇంటి పని, వంట పని చేస్తూ చాలా మంది సెలబ్రిటీలు కనిపించారు. ఇప్పుడు ఇదే బాటలో వెళ్లిన సందీప్.. వంట సామాగ్రి తోముతూ, ఇల్లు శుభ్రం చేస్తూ కనిపించాడు. ఆ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడు.
"పురుషుడూ ఇంటి పనిని గొప్పగా చేయగలడు. నిజమైన పురుషుడు క్వారంటైన్ సమయంలోనూ ఇంటి భారాన్ని, పనిని పూర్తిగా మహిళపై వేయడు. దయచేసి ఇంటి పనిలో సాయం చేయండి. నిజమైనవాడిలా ఉండండి. ఎస్.ఎస్. రాజమౌళి సర్.. మీరూ ఇలాంటి వీడియోను అప్‌లోడ్ చేసి, అందరిలోనూ స్ఫూర్తి నింపాలని కోరుతున్నా" -సందీప్ రెడ్డి వంగా, దర్శకుడు
ఛాలెంజ్ స్వీకరించిన జక్కన్న
సందీప్ రెడ్డి సవాలును రాజమౌళి స్వీకరించారు. "ఛాలెంజ్ స్వీకరిస్తున్నా సందీప్. ఇంటి పనిని మనమూ పంచుకోవడం ఎంతో ముఖ్యం. నేను ఇంటి పని చేస్తున్న వీడియోను రేపు(సోమవారం) అప్‌లోడ్ చేస్తా" అని బదులిచ్చారు రాజమౌళి.
-
Challenge accepted, Sandeep!
— rajamouli ss (@ssrajamouli) April 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
It is important we share the work load at home and I will post my home workout tomorrow... #BetheREALMAN https://t.co/cFxRikiJJE
">Challenge accepted, Sandeep!
— rajamouli ss (@ssrajamouli) April 19, 2020
It is important we share the work load at home and I will post my home workout tomorrow... #BetheREALMAN https://t.co/cFxRikiJJEChallenge accepted, Sandeep!
— rajamouli ss (@ssrajamouli) April 19, 2020
It is important we share the work load at home and I will post my home workout tomorrow... #BetheREALMAN https://t.co/cFxRikiJJE
ఇదీ చూడండి : తనలోని మరో కళను బయటపెట్టిన బ్రహ్మానందం