బాలీవుడ్ యువ నటుడు అర్జున్ కపూర్ కరోనా బారినపడ్డాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని బాగానే ఉన్నట్లు స్పష్టం చేశాడు.
"నేను కరోనా బారినపడ్డాను. ఈ విషయాన్ని అందరికీ తెలపడం నా బాధ్యత. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. డాక్టర్ల సూచన మేరకు హోం క్వారంటైన్లో ఉన్నా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరిని కృతజ్ఞతలు. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ తరచూ ఇస్తూనే ఉంటా. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. మానవత్వం వైరస్ను జయిస్తుందని భావిస్తున్నా."
-అర్జున్ కపూర్ పోస్ట్
ప్రస్తుతం 'భూత్ పోలీస్' అనే చిత్రంలో నటిస్తున్నాడు అర్జున్ కపూర్. ఇందులో సైఫ్ అలీ ఖాన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">