ETV Bharat / sitara

కరోనా నిబంధనల అతిక్రమణ.. సల్మాన్ సోదరులపై కేసు - క్వారంటైన్​కు సల్మాన్ సోదరులు

కరోనా నిబంధనలు అతిక్రమించారంటూ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్​ కుటుంబ సభ్యులను ముంబయి ఆరోగ్య అధికారులు క్వారంటైన్​కు తరలించారు. నిబంధనలను అతిక్రమణకు అంటువ్యాధుల చట్టం కింద వారిపై పోలీసు కేసు కూడా నమోదు చేశారు.

Arbaaz Khan, Sohail and son booked for violating COVID-19 norms
కరోనా నిబంధనల అతిక్రమణ.. సల్మాన్ సోదురులపై కేసు
author img

By

Published : Jan 5, 2021, 6:27 PM IST

కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌ కుటుంబసభ్యులను ముంబయి అధికారులు క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. బాలీవుడ్‌ నటుడు నిర్మాత సొహైల్‌ ఖాన్, ఆయన కుమారుడు నిర్వాణ్‌ ఖాన్‌, మరో సోదరుడు అర్బాజ్‌ఖాన్‌లపై పోలీసు కేసు కూడా నమోదు చేశారు.

బ్రిటన్‌లో కొత్త కరోనా రకం వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ నియమాలను కఠినంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బ్రిటన్‌, యూఏఈ, యూరోపియన్‌ దేశాలనుంచి తిరిగి వచ్చిన వారు.. ఏడురోజుల పాటు తప్పనిసరిగా ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉండాలి. కాగా, ప్రభుత్వం ఆమోదించిన హోటళ్లలో కూడా ఈ సమయాన్ని గడిపేందుకు అనుమతించారు.

ఈ నియమాలను ఉల్లంఘించారని సల్మాన్‌ కుటుంబ సభ్యులపై బీఎంసీ వైద్యాధికారి ఒకరు ఫిర్యాదు చేశారు. దుబాయ్ నుంచి డిసెంబర్‌ 25న తిరిగి వచ్చిన వీరు .. హోటల్‌లో క్వారంటైన్‌ సమయాన్ని గడిపేందుకు బదులుగా తమ ఇంటికే వెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అంటువ్యాధుల చట్టం సెక్షన్ 188 కింద నగరంలోని ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌లో సొహైల్‌, ఆర్బాజ్‌, నిర్వాణ్‌లపై సోమవారం ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. అనంతరం వారిని క్వారంటైన్‌లో ఉంచేందుకు నగరంలోని తాజ్‌ ల్యాండ్స్‌ ఎండ్‌ హోటల్‌కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.